newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

20-01-202020-01-2020 17:20:18 IST
Updated On 21-01-2020 11:11:34 ISTUpdated On 21-01-20202020-01-20T11:50:18.397Z20-01-2020 2020-01-20T11:46:56.327Z - 2020-01-21T05:41:34.400Z - 21-01-2020

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాపాక వరప్రసాద్.. ఏపీ అసెంబ్లీలో ఏకైక జనసేన ఎమ్మెల్యే. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి ఎన్నికైన ఈయన శరీరం మాత్రం జనసేనలో వుంటుంది. మనసంతా వైసీపీ వైపే. మనిషిక్కడ.. మనసక్కడ. తాజాగా మూడురాజధానులకు సంబంధించి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో తన వైఖరి చాటుకున్నారు. తన అధినేతనే ధిక్కరించారు. తన దారి రహదారేనని నిరూపించుకున్నారు.

పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లిఖిత పూర్వకంగా జారీ చేసిన విప్‌ని తుంగలో తొక్కేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారు. పార్టీ విధానానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మూడు రాజధానుల ప్రతిపాదన గట్టిగా సమర్థించారు.దీంతో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇదో వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీనుంచి సస్పెండ్ చేస్తే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీ తరహాలోనే తనకు ప్రత్యేక సీటు కావాలని స్పీకర్ తమ్మినేని సీతారాంని అడిగే అవకాశం ఉందంటున్నారు. 

పార్టీ నిర్ణయానికి సంబంధించి మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేస్తానని రాపాక ప్రకటించారు. తనను అడ్డుకునేందుకు జనసేన అధినేత చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టారు. పార్టీ విధానానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రకటన చేసిన రాపాక వరప్రసాద్.. బిల్లుపై ఓటింగ్ జరిగితే.. అనుకూలంగా ఓటు కూడా వేస్తానని చెప్పారు. తరచూ ముఖ్యమంత్రిని కూడా కలుస్తూనే వున్నారు రాపాక. 

రాపాక తాజా అడుగులతో ఆయన మనసులో మాటేంటో అర్థమైపోయింది. దీంతో తాడో పేడో తేల్చుకునేందుకు జనసేన హైకమాండ్ సిద్దమైనట్లే. పవన్ లేఖను పట్టించుకోని రాపాక బంతిని తిరిగి పవన్ కల్యాణ్ కోర్టులోకి నెట్టేశారు. తనపై వేటు వేస్తే.. డైరెక్టుగా వైసీపీతో కలిసి పని చేసేందుకు సిద్దమవుతున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. పైగా అసెంబ్లీలో సీఎం జగన్ తో భేటీ కావడం, సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశంగా మారింది. 

పవన్ కళ్యాణ్ లేఖలో ఏముందంటే.. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని పార్టీలోని వివిధ స్థాయిలలో జరిగిన సమావేశాలలో ఏకాభిప్రాయం వ్యక్తమయింది. ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. రాజధాని నిర్మాణం అమరావతిలోనే కొనసాగాలని, ప్రభుత్వ పాలన సంపూర్ణంగా అమరావతినుంచే కొనసాగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఈ సమావేశాలలో ఏకాభిప్రాయం వ్యక్తం అయింది. ఈరోజు జరగనున్న సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ క్రింది బిల్లులను ప్రవేశపెడుతున్న సంగతి మీకు విదితమే..

1.ఏపి. డిసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్మెంటు రీజియన్ యాక్ట్ 2020

2. అమరావతిలో మెట్రో డెవలప్మెంట్ యాక్ట్ 2020

పార్టీ నియమానుసారం మీరు శాసనసభ సమావేశాలకు హాజరై, పై రెండు బిల్లులను ప్రవేశపెట్టే సమయంలోనూ, ఓటింగ్ లోనూ వ్యతిరేకించవలసిందిగా కోరుతున్నాను.

                                                                                                                                                            ఇట్లు 

                                                                                                                                                     పవన్ కళ్యాణ్ 

                                                                                                                                                 అధ్యక్షుడు, జనసేన పార్టీ 

No photo description available.

చదవండి : మేం తెగిస్తే మీరు తట్టుకోలేరు.. పవన్ వార్నింగ్


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle