newssting
BITING NEWS :
*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

నేడు ఉచిత బియ్యం..ఏప్రిల్‌ 1న అందరికీ పెన్షన్లు.. 4న రూ.1000 ఆర్థిక సాయం

29-03-202029-03-2020 09:04:52 IST
2020-03-29T03:34:52.017Z29-03-2020 2020-03-29T03:34:45.826Z - - 04-06-2020

నేడు ఉచిత బియ్యం..ఏప్రిల్‌ 1న అందరికీ పెన్షన్లు.. 4న రూ.1000 ఆర్థిక సాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌ నివారణ కోసం విధించిన లాక్‌డౌన్‌తో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. ఏప్రిల్‌ 1న పెన్షన్ల పంపిణీకి సిద్ధమవుతోంది.  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో శనివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పేదలకు ఆహార భద్రతలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌ సందర్భంగా వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయినా, రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినప్పటికీ, పెన్షనర్లను, పేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎప్పటిలానే ఏప్రిల్‌ ఒకటో తేదీనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గ్రామ వలంటీర్ల ద్వారా పెన్షన్లను డోర్‌ డెలివరీ చేయనున్నారు. వీటితో పాటు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విధంగా ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.1,000 చొప్పున ఏప్రిల్‌ 4వ తేదీన ఆర్థిక సహాయం చేయనున్నారు. దీనిని కూడా గ్రామ వలంటీర్లు ఇంటివద్దకు తీసుకువచ్చి ఇస్తారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేటి నుంచి అంటే ఆదివారం నుంచి ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పును పంపిణీచేయనుంది. ఇది కాక ఏప్రిల్‌ నెలలో 15వ తేదీన, 29వ తేదీన మరో రెండు సార్లు ఉచితంగా బియ్యం, కంది పప్పును ఇచ్చే విధంగా సన్నద్ధమవుతోంది. క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశం నిర్వహించారు. పేదలకు ఆహార భద్రతలో ఎలాంటి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. 

కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్రంలోని పేదకుటుంబాల ఆహార భద్రతకు ముప్పురాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇది వరకే సీఎం వైఎస్‌ జగన్‌ మార్చి 29నే ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పును అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం నుంచి ఈ రేషన్‌ను అందిస్తారు. దీంతోపాటు ఏప్రిల్‌ 15న మరోసారి రేషన్‌ను పంపిణీచేయనున్నారు. అప్పుడు కూడా నిర్దేశించిన బియ్యంతోపాటు, కిలో కందిపప్పును ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అలాగే ఏప్రిల్‌ 29న మూడోసారి రేషన్‌ను అందించనున్నారు. బియ్యంతోపాటు, కేజీ కందిపప్పును ప్రతి పేదకుటుంబానికీ ఇవ్వాలని నిర్ణయించారు. 

కేంద్ర ప్రభుత్వం అదనంగా ఉచిత రేషన్‌ ఇస్తున్నట్టు ప్రకటించినా, కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకం కొన్ని కుటుంబాలకే వర్తిస్తోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుటుంబాలకూ ఉచిత రేషన్, కేజీ కందిపప్పును అందించాలని నిర్ణయించింది. 

కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సమర్థంగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించడం లేదు. లాక్‌డౌన్‌తో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులివ్వడంతో ఇళ్లకే పరిమితమైన పేద, మధ్యతరగతి విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా బియ్యం, కోడిగుడ్లు, చిక్కీని వారి ఇళ్లకే పంపే ఏర్పాట్లు చేసింది. మొదటి దశలో మార్చి 19 నుంచి 31 వరకూ తొమ్మిది పని దినాలకుగాను రాష్ట్రవ్యాప్తంగా 45,753 ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 37 లక్షల మంది విద్యార్థులకు బియ్యం, కోడిగుడ్లు, చిక్కీని అందజేసింది. ఇప్పుడు రెండో దశ కార్యక్రమాన్ని అమలు పర్చేందుకు నిర్ణయించింది. 

ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 14 వరకూ తొమ్మిది రోజుల పాటు పాఠశాలల పనిదినాలను లెక్కించి ఆ మేరకు ఇళ్లలో ఉంటున్న విద్యార్థులకు సరుకుల పంపిణీకి శనివారం ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్‌ 14 తర్వాత  పాఠశాలలను తెరవకుంటే విద్యాసంవత్సరం చివరి రోజైన 23 వరకూ పరిగణనలోకి తీసుకుని మొత్తం 17 రోజులకు సరుకులు సరఫరా చేయనున్నట్టు రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం అదనపు డైరెక్టర్‌ కె.రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. రెండో దశ పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్‌ ఒకటో తేదీన ప్రారంభిస్తామన్నారు. 

ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కేజీ 700 గ్రాములు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 2 కేజీల 550 గ్రాముల చొప్పున బియ్యం అందిస్తారు. ఒక్కో విద్యార్థికి తొమ్మిది చిక్కీలు, 17 చొప్పున కోడిగుడ్లు ఇస్తారు.  గ్రామ, వార్డు వలంటీర్లు, సిబ్బంది ద్వారా విద్యార్థుల ఇంటికి వెళ్లిమరీ వీటిని పంపిణీ చేయనున్నారు. పంపిణీ సమయంలో సామాజిక దూరం పాటించాలని ఎంఈవోలు, హెచ్‌ఎంలు, వలంటీర్లకు రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు.

మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!

మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!

   17 minutes ago


హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

   an hour ago


మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

   3 hours ago


ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

   5 hours ago


ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

   5 hours ago


కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

   5 hours ago


ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

   6 hours ago


పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

   7 hours ago


కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

   7 hours ago


కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

   19 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle