newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలుగు గడ్డపై జాతీయ పార్టీలు జీరొనేనా..?

09-05-201909-05-2019 08:26:49 IST
Updated On 01-07-2019 11:55:47 ISTUpdated On 01-07-20192019-05-09T02:56:49.387Z09-05-2019 2019-05-09T02:54:52.225Z - 2019-07-01T06:25:47.530Z - 01-07-2019

తెలుగు గడ్డపై జాతీయ పార్టీలు జీరొనేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్  రాజకీయాలో జాతీయ పార్టీలు నామ‌మాత్రం అయిపోయాయి. ప్రాంతీయ పార్టీల ప్ర‌భ వెలిగిపోతుండ‌టంతో జాతీయ పార్టీలు ఢీలా ప‌డ్డాయి. రెండు పార్టీలూ చేజేతులా చేసిన త‌ప్పుల‌తో రాష్ట్రంలో ఆ పార్టీల ప్రాబల్యం వేగంగా ప‌డిపోతోంది. క‌నీసం ఈసారి కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులుగా ఉన్న ర‌ఘువీరారెడ్డి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అయినా గెలుస్తారు అని ధీమాగా చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఒక‌ప్పుడు రాష్ట్రంలో బ‌లంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా నామ‌మాత్ర‌మైంది. వైసీపీ ఆవిర్భావం, రాష్ట్ర విభ‌జ‌న చేసిన నేప‌థ్యంలో ఆ పార్టీ రాష్ట్రంలో క‌నుమ‌రుగ‌య్యే దిశ‌లో ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో చాలామంది ముఖ్య‌నేత‌లు పోటీ చేసినా ఒక్క సీటును గెలుచుకోలేక‌పోయిన ఆ పార్టీ ఈసారి ఒక్క స్థాన‌మైనా గెలుస్తామ‌ని ధీమాగా ఉంది.

అనంత‌పురం జిల్లా క‌ళ్యాణదుర్గం నుంచి పోటీ చేసిన పీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి విజ‌యం సాధిస్తార‌ని ఆ పార్టీ నేత‌లు న‌మ్మ‌కంగా ఉన్నారు. ఇక్క‌డ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాద‌ని కొత్త అభ్య‌ర్థికి టిక్కెట్ ఇచ్చింది. టీడీపీ క్యాడ‌ర్ అంత‌ర్గ‌తంగా కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఇక్క‌డ ర‌ఘువీరారెడ్డి, వైసీపీ అభ్య‌ర్థి ఉష‌శ్రీ చ‌ర‌ణ్ మ‌ధ్య  ప్ర‌ధాన పోటీ జ‌రిగింది. ఇక్క‌డ ర‌ఘువీరారెడ్డి భారీగా ఓట్లు సాధించినా గెలుస్తార‌ని క‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది.

ఇక‌, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు క‌న్నా ల‌‌క్ష్మీనారాయ‌ణ నర‌స‌రావుపేట పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఇక్క‌డ తాను గెలిచి, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే ఆయ‌న కేంద్ర మంత్రి అవుతార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే, న‌ర‌స‌రావుపేట‌లో క‌న్నా గెలుపు మాత్రం అంత సులువుగా క‌నిపించ‌డం లేదు.

న‌ర‌స‌రావుపేట‌లో సిట్టింగ్ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు మ‌రోసారి పోటీ చేశారు. టీడీపీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉంది. ఇక‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు అనే యువ‌నేత బ‌రిలో నిలిచారు. ఆయ‌న కూడా త‌క్కువ స‌మ‌యంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు సాధించారు. ఆయ‌న ప‌ట్ల కూడా ప్ర‌జ‌ల్లో ఆధ‌ర‌ణ కనిపించింది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ జ‌రిగింది. ఫ‌లితంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా భారీగానే ఓట్లు సాధించినా విజ‌యావ‌కాశాలు మాత్రం క‌నిపించ‌డం లేదు.

మొత్తంగా ర‌ఘువీరారెడ్డి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గెల‌వ‌క‌పోతే ఈసారి జాతీయ పార్టీలు రెండూ ఆంధ్ర‌ప్రదేశ్‌లో పూర్తిగా క‌నుమ‌రుగు అయ్యే అవ‌కాశం ఉంది. మ‌రి, ఏం జ‌రుగుతుందో ఈ నెల 23న చూడాలి.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   2 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   5 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   10 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   10 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   8 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   11 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   7 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   12 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle