newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

తీరు మారని తీర్మానం

18-06-201918-06-2019 22:39:23 IST
Updated On 21-06-2019 15:17:38 ISTUpdated On 21-06-20192019-06-18T17:09:23.930Z18-06-2019 2019-06-18T17:09:15.674Z - 2019-06-21T09:47:38.513Z - 21-06-2019

తీరు మారని తీర్మానం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా ‘ప్రత్యేక హోదా’పై ప్రస్తుతం మరో నాటకానికి తెరలేచింది. తాజా నాటకంలో కొత్తదనం ఆశించద్దు. ఎందుకంటే అలాంటిదేం ఉండదు. డైలాగ్ టు డైలాగ్.. సీన్ టు సీన్.. సేమ్ టు సేమ్.. అదే డ్రామా.. డిటో డిటో. కాకపోతే పాత్రధారులు మారారు. అప్పుడు తెలుగుదేశం శాసనసభ్యులు అధికార పక్షంలో కూర్చుంటే, వీళ్లు ఎగతాళి చేసేవారు. ఇప్పుడు జస్ట్ సీన్ రివర్స్.. 

అదే స్టేట్‌మెంట్.. అదే తీర్మానం. వాక్యాలు కూడా పెద్దగా మార్చినట్టు లేదు. అప్పుడు చంద్రబాబు ప్రకటన చేసి తీర్మానం చదివితే, ఇప్పుడు జగన్ ఆ పని చేశాడు. అంతే తేడా. కాకపోతే, ‘గత శాసనసభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల.. ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదాయే కావాలని మరోసారి ఇదే అసెంబ్లీ నుంచి తీర్మానం పంపుతున్నాం’ అని తాజా ప్రకటనలో కాస్త క్లారిటీ ఇవ్వడం ఒక హైలైట్.

ఈ తీర్మానం రాసిన వాళ్లెవ్వరో కానీ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా జీవనాడి అని పేర్కొనడం ఒక సైడ్‌లైట్. ఎందుకంటే నిన్నటివరకు పోలవరం మన జీవనాడి అని చంద్రబాబు అంటుండటం వల్ల అదొక్కటే మనందరి లైఫ్ లైన్ అనుకునే వారందరికీ కొత్తగా ఏపీకి మరో జీవనాడి వచ్చి చేరిందని కాస్త సంతోషం మిగిలింది.   

గత ప్రభుత్వంలో ‘ప్రత్యేక హోదా’ తీర్మానం పేరుతో రక్తి కట్టించే సీన్లు సృష్టించి రాజకీయ రగడ రాజేసి గంటల కొద్దీ సమయాన్ని గడిపేశారు. అది అందరికీ తెలుసు. ఈ తీర్మానాల వల్ల ఒరిగేది ఏదీ లేదని సాక్షాత్తూ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పటి ముఖ్యమంత్రే అధికార పక్షాన్ని గేలిచేశారు. కేంద్రంతో రాజీపడి ఇక్కడ నాటకాలు ఆడుతున్నారని తెగ దుమ్మెత్తి పోసేవారు. దమ్ముంటే ఎంపీలందరూ రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ చేసేవారు. ఇప్పడా సీన్లన్నీ రిపీట్ అవుతున్నాయి. 

నిజం చెబితే నిష్టూరం కానీ, అప్పుడూ లేదా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు ఏ ఆప్షన్లూ లేవు. కేంద్రంతో సయోధ్యతో ఉండి రావాల్సినవి రాబట్టుకోవడమే తప్ప, ప్రత్యామ్నాయాలు లేవు. ‘పోరాడితే పోయేదేం లేదు’ అని తెగ రెచ్చిపోతే మాత్రం చంద్రబాబులా అధికారం పోగొట్టుకోవాల్సిందే. ఈ విషయంలో జగన్మోహన్‌రెడ్డికి మరీ ఇబ్బందికర పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన కేసులు ఉండనే ఉన్నాయి. గొంతెత్తి అరిస్తే కేంద్రంలో కరుస్తారు. 

పొరుగు రాష్ట్రంలో ‘ఓటుకు నోటు’ కేసు మినహా చంద్రబాబుకు ఈ తరహా ఇబ్బందులేం ఉండేవి కావు కాబట్టే, ఎన్నికల ప్రచారంలో మోడీపై విరుచుకుపడేందుకు వీలయ్యింది. ప్రభుత్వాన్ని అలా నానాయాగీ చేస్తుంటే మోడీ షా మాత్రం తమాషా చూస్తూ కూర్చున్నారా.. లేదు. టీడీపీ ముఖ్యులపై ఐటీ దాడులు, సీబీఐ కేసులు షురూ చేశారు.

ఇప్పుడు కేంద్రంలో కమలాకరులు హార్లిక్స్ తాగి మరింత బలవర్ధకం అయ్యారు. అసలే దక్షిణాది రాష్ట్రాలలో జాగా వెతికి పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక హోదా పేరుతో ఇప్పుడీ రిపీట్ డ్రామాను రెండో కృష్ణుడొచ్చి మరీ సాగదీస్తే జగన్నాటక ‘సూత్రధారి’ ఊరుకుంటాడని అనుకోవడం పొరబాటు. ఎవరి ప్లాన్లు వారికి ఉంటాయి. కాబట్టి కామ్రెడ్.. ఇక్కడ చెప్పేదేంటంటే.. ఏంలేదు. జనానికి అన్నీ తెలుసు!

వీడియో చూస్తే మీకనిపించేది ఇదే... సేమ్ టైప్ ఆఫ్ కార్డ్ ప్రింటెడ్.. నేమ్స్ డిఫరెంట్..  (అసెంబ్లీలో కోటా గారి కామెడీ)       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle