newssting
BITING NEWS :
*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన* Ap గవర్నర్‌ను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, కార్మికుల సమస్యలపై చర్చ*ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై సీఎం జగన్‌ వ్యాఖ్యలు ఖండిస్తున్నా..కన్నా లక్ష్మీనారాయణ *శివసేన గడువును తిరస్కరించిన గవర్నర్‌...మూడో పెద్దపార్టీగా ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం*కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిసిన ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి *ఏపీ కొత్త సీఎస్ గా నీలం సహాని...కేంద్రం నుంచి నీలం సహాని రిలీవ్*మహారాష్ట్ర: నేడు ఎమ్మెల్యేలతో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ భేటీ.. శివసేనకు మద్దతిచ్చే అంశంపై చర్చ*తెలంగాణలో 39వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు గవర్నర్‌ను కలవనున్న జేఏసీ నేతలు*గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం..జనం మీదకు దూసుకెళ్లిన లారీ... ముగ్గురి మృతి..ఐదుగురికి గాయాలు

తండ్రి ముద్ర బ‌లంగా వేస్తున్న జగన్

09-07-201909-07-2019 07:30:04 IST
Updated On 09-07-2019 11:25:27 ISTUpdated On 09-07-20192019-07-09T02:00:04.561Z09-07-2019 2019-07-09T01:58:14.712Z - 2019-07-09T05:55:27.146Z - 09-07-2019

తండ్రి ముద్ర బ‌లంగా వేస్తున్న జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శ‌క్తిగా ఎద‌గ‌డంలో, వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డంలో ఆయ‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర కీల‌కం. మ‌ర‌ణించినా తెలుగు ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఏ నాయ‌కుడికీ లేని విధంగా గ్రామ‌గ్రామాన ఆయ‌న విగ్ర‌హాలు ఉన్నాయి. ఓ జిల్లాకే ఆయ‌న పేరు పెట్టారు. 

జ‌గ‌న్ పార్టీకి ఏకైక ఎజెండా కూడా రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల‌న‌ను మ‌ళ్లీ తీసుకురావ‌డ‌మే. ఇదే నినాదంతో జ‌గ‌న్ ఎన్నిక‌ల్లోకి వెళ్లి ఘన విజ‌యం సాధించారు. ఐదున్నరేళ్ళు మాత్ర‌మే ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్సార్ ప్ర‌జ‌ల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా రైతులు, ప్రాజెక్టులు, పింఛ‌న్లు, ఆరోగ్య‌శ్రీ, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ వంటి ప‌థ‌కాల విష‌యంలో ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేరు. 

ఇత‌ర విష‌యాల్లో వైఎస్‌ను విభేదించే వారు కూడా ఈ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు చేసిన మేలును కాద‌న‌లేరు. ప్ర‌భుత్వాలు మారినా ఈ ప‌థ‌కాలను మాత్రం తెలంగాణ‌లో, ఏపీలో తొల‌గించే ధైర్యం చేయ‌లేదు. ఇంత‌లా గుర్తింపు పొందిన ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టిన వైఎస్సార్ ఏ ప‌థ‌కానికి కూడా త‌న పేరు పెట్టుకోలేదు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం అంటే విధేయ‌త ఉండే ఆయ‌న అన్ని ప‌థ‌కాల‌కు ఇందిర‌, రాజీవ్ గాంధీ పేర్లే పెట్టారు. 

త‌ర్వాత వ‌చ్చిన కిర‌ణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్‌, చంద్ర‌బాబు ప‌లు ప‌థ‌కాల‌కు వారి పేర్లు పెట్టుకున్నారు. అయితే, ఇప్పుడు ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ముందు ప‌థ‌కాల పేర్ల‌పైనే ప్ర‌ధానంగా దృష్టి పెట్టారు.

త‌న తండ్రి పేరు చిర‌స్థాయిలో నిలిచిపోయేలా ఆయ‌న బ‌ల‌మైన ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వైఎస్సార్ హ‌యాంలో వ‌చ్చి త‌ర్వాత చంద్ర‌బాబు హ‌యాంలో పేర్లు మారిన ప‌థ‌కాల‌కు త‌న తండ్రి వైఎస్సార్ పేరును పెడుతున్నారు. 

జ‌గ‌న్ ప్ర‌క‌టించిన, అమ‌లు చేస్తున్న అన్ని ప‌థ‌కాల‌కు రెండో ఆలోచన లేకుండా వైఎస్ పేరునే పెడుతున్నారు. త్వ‌ర‌లో పోల‌వరం ప్రాజెక్టుకు వైఎస్సార్ పోల‌వ‌రం అని పేరు పెడ‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. పోల‌వరం నిర్మాణం కోసం వైఎస్ త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, ఏకంగా వైఎస్ జ‌యంతిని రైతు దినోత్స‌వంగా ప్ర‌క‌టిస్తూ జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం మాత్రం మ‌రో అడుగు ముందుకేసిన‌ట్లే. 

రైతుల కోసం వైఎస్సార్ హ‌యాంలో మంచి నిర్ణ‌యాలు తీసుకున్న మాట వాస్త‌వ‌మే. అయితే, వైఎస్సార్ హ‌యాంలోనే  ఎక్కువ రైతు ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగాయ‌నేది టీడీపీ ఆరోప‌ణ‌. పార్టీల ఆరోప‌ణ ఎలా ఉన్నా రైతుల్లో వైఎస్సార్‌కు మంచి పేరుంది.

ఇప్పుడు వైఎస్సార్ జ‌యంతిని ఏకంగా రైతు దినోత్స‌వంగా జ‌ర‌ప‌డం ద్వారా వైఎస్సార్ అంటే రైతు అనే ముద్ర వేసేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నించారు. అయితే, గ‌తంలో ప్ర‌భుత్వాలు మారినా ఏదైనా ప్రాజెక్టు నిర్మాణంలోనో, ప‌థ‌కం రూప‌క‌ల్ప‌న‌లోనో ఏ నేత పాత్ర ఎక్కువ ఉందో వారి పేర్లు ఆ ప‌థ‌కాల‌కు కొన‌సాగించేవారు. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. 

ఒకవేళ 2024లో వైసీపీ అధికారం కోల్పోయి టీడీపీ వ‌స్తే ఈ పేర్లు మార్చి ఎన్టీఆర్‌, చంద్ర‌న్న అని పెట్టుకుంటారు. రైతు దినోత్స‌వం కూడా నిర్వ‌హించ‌రు. అయినా కూడా జ‌గ‌న్ మాత్రం ఈ విష‌యంలో మ‌రో ఆలోచ‌న చేయ‌డం లేదు. త‌న తండ్రి ముద్ర పాల‌న‌లో, ప‌థ‌కాల్లో, ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఎప్ప‌టికీ నిలిచిపోవాల‌ని భావిస్తున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle