newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్.. 17మంది సస్పెన్షన్

21-01-202021-01-2020 08:56:51 IST
Updated On 21-01-2020 10:53:41 ISTUpdated On 21-01-20202020-01-21T03:26:51.494Z21-01-2020 2020-01-21T03:26:47.354Z - 2020-01-21T05:23:41.829Z - 21-01-2020

టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్.. 17మంది సస్పెన్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి కేవలం అసెంబ్లీకి పరిమితం చేసి,. మూడురాజధానులకు పచ్చజెండా ఊపడంపై జగన్ సర్కార్ తీరుని టీడీపీ తీవ్రంగా ప్రతిఘటించింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ నుంచి 17 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సీఆర్డీఏ బిల్లు రద్దుపై చర్చ సందర్భంగా స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. 

సీఎం జగన్ ప్రసంగాన్ని ఉద్దేశపూర్వకంగా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ సభ్యులు 17మందిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయినవారిలో టీడీపీ ఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు, కరణం బలరాం, ఆదిరెడ్డి భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, వెంకటరెడ్డి నాయుడు, వాసుపల్లి గణేశ్, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, ఏలూరి సాంబశివరావు, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయస్వామిని సభ నుంచి సస్పెండ్ చేశారు. అంతకుముందు చర్చ సందర్భంగా అచ్చెన్నాయుడు తీరుని స్పీకర్ తప్పుబట్టారు. ఒక దశలో సెన్సాఫ్ హ్యూమర్ లేదా అని కోపంతో ఊగిపోయారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle