టీటీడీ ప్రక్షాళనపై ‘జగన్’ ఫోకస్.. కీలక బదిలీలు!
02-07-201902-07-2019 15:55:46 IST
2019-07-02T10:25:46.789Z02-07-2019 2019-07-02T10:25:42.855Z - - 16-01-2021

అధికారంలోకి వచ్చి నెలరోజులు పూర్తయింది. ఏడాదిలో ఉత్తమ సీఎం అనిపించుకుంటానని ప్రమాణ స్వీకారం నాడే చెప్పిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన రీతిలో పాలనలో మార్పులు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, నిధుల దుర్వినియోగంపై దృష్టిపెట్టారు. తాజాగా ప్రతిష్టాత్మకమయిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో పోటీగా దూరంగా ఉంచిన తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ పగ్గాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే టీటీడీలో ఎంతోకాలంగా తిష్టవేసుకుని కూర్చున్న అధికారులపై బదిలీ వేటు వేస్తున్నారు. తాజాగా టీటీడీ జేఈవో శ్రీనివాసరాజుని బదిలీ చేశారు. ఆయన స్థానంలో బసంత్ కుమార్ ను నియమించారు. శ్రీనివాసరాజును సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. బసంత్‌కుమార్ తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, బసంత్‌కుమార్ ప్రస్తుతం వీఎంఆర్డీఏ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. టీటీడీలో ఏ అధికారి బదిలీ అయినా శ్రీనివాసరాజు మాత్రం అక్కడే ఉండిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నియమించబడ్డ శ్రీనివాసరాజుని మార్చాలని గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. కానీ ఆయన్ని మార్చలేకపోయారు. ఏడున్నరేళ్లకు పైగా ఒకే పోస్టులో ఉంటూ హవా సృష్టించిన టీటీడీ జేఈవో శ్రీనివాస రాజును సీఎం జగన్ అక్కడినించి కదిలించారు. ఢిల్లీలో రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తి ఆశీస్సులతోనే ఆయన అక్కడ కొనసాగారనే ప్రచారం ఉంది. అదే విధంగా తాజా ఎన్నికల్లో ఆయన ఒక దశలో టీడీపీ నుండి పోటీ చేస్తారని చెప్పుకున్నారు. కానీ అదేం జరగలేదు. టీటీడీలో ఈవో కంటే ఒక విధంగా శ్రీనివాస రాజే అన్ని విభాగాల్లోనూ కీలకంగా మారారు. ప్రధాని, రాష్ట్రపతి, వివిధ దేశాల అధ్యక్షులు, ప్రముఖ వ్యక్తులు..పారిశ్రామిక వేత్తలు..రాజకీయ నేతలు .. న్యాయమూర్తులు ఎవరు శ్రీవారి దర్శనానికి వచ్చిన శ్రీనివాస రాజు దగ్గరుండి వారికి దర్శనం ఏర్పాట్లు చేయించేవారు. టీటీడీ ఈవో కంటే టీటీడీ జేఈవోనే కీలకంగా వ్యవహరించేవారు. ఆయన్ని మార్చడంతో టీటీడీలో ఎన్నో ఏళ్ళుగా ఉన్న అధికారులకు మరిన్ని బదిలీలు తప్పవంటున్నారు. అలాగే స్వామివారి దర్శనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ప్రస్తుతం ప్రొటోకాల్ దర్శనంతో పాటు ఎల్1, ఎల్2, ఎల్3లుగా ఉన్న వీఐపీ బ్రేక్ దర్శనాల విభజనను రద్దు చేయాలని ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా వివిధ రకాల వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేయడం ద్వారా సామాన్యులకు చేరువ చేయనున్నారు. త్వరలో ధర్మకర్తల మండలి పూర్తి స్థాయిగా ఏర్పడిన తరువాత తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద టీటీడీ ప్రక్షాళనకు ఇది ముందడుగు మాత్రమేనని ఇంకా చేయాల్సింది ఎంతో ఉందంటున్నారు సుబ్బారెడ్డి.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!
4 hours ago

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం
5 hours ago

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?
6 hours ago

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
11 hours ago

వరస్ట్ సీఎంలలో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే
12 hours ago

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా
13 hours ago

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?
14 hours ago

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్
15 hours ago

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?
16 hours ago

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?
16 hours ago
ఇంకా