newssting
BITING NEWS :
*అఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఘోర బాంబు పేలుడు..63 మంది మృతి *నేడు హైదరాబాద్‌లో జేపీ నడ్డా పర్యటన*డల్లాస్‌ లో ప్రవాసాంధ్రులతో ఏపీ సీఎం జగన్‌ సభ *హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సులేట్‌ ఆధ్వర్యంలో 10కే రన్‌ * ఫిల్మ్‌నగర్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు… 24 వాహనాలు సీజ్‌*అవినీతిలేని ఆంధ్రప్రదేశ్‌ నిర్మించాలన్నదే నా కల : ఏపీ సీఎం జగన్‌

టార్గెట్ జగన్.. రాధా ప్లాన్!?

24-01-201924-01-2019 14:37:56 IST
2019-01-24T09:07:56.814Z24-01-2019 2019-01-24T08:13:18.431Z - - 19-08-2019

టార్గెట్ జగన్.. రాధా ప్లాన్!?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బెజవాడలో రాజకీయాలు... అక్కడి ఎండల్లాగే ఎప్పుడూ వేడివేడిగా, చెమటలు పట్టిస్తుంటాయి. తాజాగా వంగవీటి రాధా ఎపిసోడ్ రాజకీయాలను మరింత హీటెక్కిస్తోందనే చెప్పాలి. వైసీపీలో తనకు సరైన ప్రాధాన్యత లేదని భావించిన వంగవీటి రాధా తన భవిష్యత్తు కార్యాచరణకు దిగారు. వైసీపీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని వంగవీటి రాధాకృష్ణ అంటున్నారు. ఈ అవమానాలు వేరెవరికీ జరగకూడదన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మనసులో మాటల్ని బయటపెట్టారు. తన తండ్రి అభిమానులను సంతృప్తి పరిచేందుకే ఆయన విగ్రహావిష్కరణకు వెళ్లానన్నారు. విగ్రహావిష్కరణకు ఎందుకు వెళ్లావంటూ జగన్‌ స్వయంగా తనను మందలించారని, తనను ఇది చాలా కలచి వేసిందన్నారు. తండ్రి లేనివాడినని చేరదీశానని.. చెప్పినట్లు వినాల్సిందేనంటూ జగన్‌ ఒత్తిడి చేసేవారని రాధా ఆరోపించారు. 

ఇప్పటికైనా జగన్‌ పద్ధతి మార్చుకుని రంగా అభిమానులను గౌరవించాలని ఆయన సూచించారు. అన్ని కులాలు, మతాలు, పార్టీల్లో రంగా అభిమానులున్నారని చెప్పారు. తనను చంపేస్తామని సోషల్‌ మీడియాలో బెదిరింపులు కూడా వస్తున్నాయని, తన ప్రాణాల గురించి తనకు బెంగలేదన్నారు. ఎవరి దాడులకు తాను భయపడేవాడిని కాదన్నారు. తన ప్రాణం కంటే తన తండ్రి ఆశయం ముఖ్యమంటున్నారు. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వలేని పార్టీలో తాను ఎందుకు కొనసాగాలని రాధా ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే ఏం చేస్తారని జగన్ అంటున్నారని, ఎమ్మెల్యేలకు ఆయన విలువ ఇవ్వరన్నారు రాధా.

తమ్ముడిలాంటివాడివని జగన్ అనేవారని, కానీ అది నిజం కాదన్నారు. ఎవరైనా తనకిందే బతకాలనే నిరంకుశవాదం జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. తనకు పదవులు అక్కర్లేదన్నారు రాధాకృష్ణ. నాకు ఓపిక ఉన్నంతవరకూ తన తండ్రి పేరుని చెడగొట్టే పనులు చేయనన్నారు. మొత్తం మీద వంగవీటి రాధా ఎపిసోడ్ వైసీపీలో కాక రేపుతోంది. రాధా బాటలో మరికొందరు నడవడం పక్కా అంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీలో చేరికపై మాత్రం వంగవీటి రాధా క్లారిటీ ఇవ్వకపోవడం విశేషం. ఈ సస్పెన్స్ త్వరలో వీడిపోనుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle