newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

జగన్ కీలకనిర్ణయం.. ఆ ముగ్గురిలో సజ్జలకే కీలక బాధ్యతలు

02-07-202002-07-2020 09:48:02 IST
Updated On 02-07-2020 12:02:24 ISTUpdated On 02-07-20202020-07-02T04:18:02.287Z02-07-2020 2020-07-02T04:17:50.220Z - 2020-07-02T06:32:24.804Z - 02-07-2020

జగన్ కీలకనిర్ణయం.. ఆ ముగ్గురిలో సజ్జలకే కీలక బాధ్యతలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. అటు పార్టీని బలోపేతం చేసేందుకు నడుం బిగించారు.  పాలనా బాధ్యతలు స్వీకరించిన ఏడాది తర్వాత పార్టీ పరిస్థితులను, జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుని పరిశీలించనున్నారు. ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు సమయం కేటాయించనున్నారు. ప్రారంభం నుంచి జగన్ పార్టీపై అంతగా ఫోకస్ పెట్టిన సందర్భాలు తక్కువే. పార్టీని పట్టించుకోకపోతే ఎలా అని ఎమ్మెల్యేలే బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో జగన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆయన ముగ్గురు ముఖ్య నేతలకు పార్టీ బాధ్యతలను అప్పగించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక అధికార ప్రకటన వెలువడింది.  అయితే ఈ ప్రకటన అనంతరం పార్టీలో విస్తృత స్థాయిలో చర్చకు ఆస్కారం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఆయన పుట్టినరోజునాడే జగన్ షాకిచ్చారనే చర్చ సాగుతోంది. 

నిత్యం తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో కీలకంగా వ్యవహరించే విజయసాయిరెడ్డిని కాదని వైసీపీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను తన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు జగన్. పార్టీలో నెంబర్ టు గా భావించే విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర వరకే పరిమితం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు విజయసాయిరెడ్డికి, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పార్టీ బాధ్యతలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఈ మార్పులను కీలకంగా భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించారని పార్టీ నేతలే చెబుతున్నారు. 

విశాఖ పాలనా రాజధాని అని ప్రకటించగానే విజయ సాయిరెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. విశాఖ అంటేనే విజయసాయిరెడ్డి. ఆయనకు అక్కడ భారీ ఎత్తున భూములు, ఆస్తులు ఉన్నాయని విపక్షాల నేతలు చేసిన విమర్శలలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో తెలీదు గానీ విశాఖలో విజయసాయిరెడ్డి ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు.

అమరావతి రాజధానిని విశాఖ నగరానికి తరలించేందుకు ముఖ్య కారకులు విజయసాయిరెడ్డే.  ఈ విషయంలో జగన్‍ను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని అంటున్నారు. విశాఖలో తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ రాజధాని తరలింపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తాజాగా నియామకాలతో విజయసాయి ప్రభ పార్టీలో తగ్గుతోందని చర్చ సాగుతోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle