newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

‘‘చైతన్యయాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర’’ బాబుపై రోజా కామెంట్స్

20-02-202020-02-2020 16:20:14 IST
Updated On 20-02-2020 16:20:07 ISTUpdated On 20-02-20202020-02-20T10:50:14.043Z20-02-2020 2020-02-20T10:49:32.505Z - 2020-02-20T10:50:07.760Z - 20-02-2020

‘‘చైతన్యయాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర’’ బాబుపై రోజా కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్ కె రోజా టీడీపీ నేతలపై తీవ్రంగా విమర్శలు చేశారు. గురువారం అమరావతిలో తన కారుని అడ్డుకున్న ఘటనపై ఆమె సీరియస్ అయ్యారు. తనపై దాడి చేసేందుకు చంద్రబాబు కుట్ర చేశారని, చంద్రబాబు ప్రజాచైతన్యయాత్ర ఎవరికోసమో చెప్పాలన్నారు. సీఎం వైయస్ జగన్ సంక్షేమపాలనను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రజల్లోకి వెళ్లేందుకు, తన ఇమేజ్ కాపాడుకునేందుకే జనచైతన్యయాత్ర పేరుతో డ్రామాలు చేస్తున్నారన్నారు. అమరావతిలో చంద్రబాబు అండ్ కో భూములు దోచుకున్నారని, అందరికోసం కాకుండా తన సామాజికవర్గం కోసమే అమరావతి నిర్మాణం చేశారన్నారు. అమరావతి రైతులెవరూ నష్టపోకుండా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఏర్పాటుచేసిన సిఆర్డి ఏ అంటే చంద్రబాబు రిలేషన్స్ దోపిడీ ఏజన్సీ అని కొత్త అర్థం చెప్పారు రోజా.

13 జిల్లాలు సమానంగా అభివృధ్ది చేయాలనే వికేంద్రీకరణ చేస్తున్నారని, తప్పుచేసిన చంద్రబాబును నాటి మంత్రులను నిలదీయాలన్నారు. ఐటి దాడుల నుంచి దృష్టిమరల్చేందుకే యాత్ర చేపట్టారని, రాజధాని ప్రాంతంలో రెండు నియోజకవర్గాలలో టిడిపిని ప్రజలు ఓడించారంటే ఏం అర్థంచేసుకోవాలన్నారు. ప్రతి దానికి దాడి పరిష్కారం కాదని, అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందనే భయంతో ఇలాచేస్తున్నారన్నారు.

చంద్రబాబు, పచ్చమీడియా డ్రామాలు ఆపాలని, ఎంఎల్ ఏలపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అమరావతి రైతులకు న్యాయం చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. రాజధాని రైతులకు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపారని, బాబు చిన్నమెదడు చితికిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు రోజా.

ఇది కూడా చదవండి ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ.. పెదపరిమిలో ఉద్రిక్తత


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle