గవర్నర్‌కి చేరిన వరద పంచాయితీ
19-08-201919-08-2019 16:47:06 IST
2019-08-19T11:17:06.998Z19-08-2019 2019-08-19T11:17:04.999Z - - 16-01-2021

ఏపీలో వరద రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు టీడీపీ నేతలు. ఏపీ గవర్నర్ హరిచందన్‌ను కలిశారు టీడీపీ నేతలు. జూలై 25 తరువాత, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు, ఏపి రాష్ట్రాన్ని కృష్ణా వరదలు వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాయి. మరి జగన్ ప్రభుత్వం ఏమి చేసిందని వారు ప్రశ్నించారు. వరద నిర్వహణ చేతకాకో, చంద్రబాబు ఇంటిని ముంచాలన్న వైసీపీ ప్రభుత్వ కుట్ర మూలంగానో కృష్ణానది వరదలు పేదల ఇళ్ళను చుట్టుముట్టి వందలమందిని నిరాశ్రయులను చేశాయి. కట్టుబట్టలతో బయటపడిన బాధితులు తిండి, తాగునీరు లేక అల్లాడుతున్నారు. ఈ సమయంలో ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి అమెరికాలో షికార్లు చేస్తూ తన పార్టీకి వచ్చిన సీట్ల గురించి గొప్పలు చెప్పుకుంటూ, ఆనంద ఆంధ్రప్రదేశ్ నా కల అంటూ ఉపన్యాసాలు దంచేస్తున్నారు. ఇక్కడేమో ప్రభుత్వం నిద్రపోతోందని టీడీపీ మండిపడింది. గోదావరి కృష్ణా నదుల వరదల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏపీ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతకు పిచ్చి పట్టిందని మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు నివాసాన్ని,చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని ఫ్లడ్ మానేజ్మెంట్ చేశారని విమర్శించారు. నిజానికి ఏపీలో అంతగా వర్షాలు పడలేదని, పైనుంచి వచ్చిన వరదను కంట్రోల్ చేయలేకపోయారని టీడీపీ నేతలు గవర్నర్ కి వివరించారు. గోదావరికి వరద వచ్చినప్పుడు జెరూసలేం,కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు సీఎం అమెరికా విహారాయాత్రలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రకాశం బ్యారేజీలో 40టీఎంసీ నీటిని నిల్వ చేసుకోవచ్చని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వరద తీవ్రత అంచనాలో, ముందస్తు సహాయక చర్యల విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. వైసీపీ నేతల అవగాహనా రాహిత్యం స్పష్టంగా తెలుస్తోంది. - నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను వినియోగించుకుంటే నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండేదన్నారు. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు నివాసం చుట్టు మంత్రులు చక్కర్లు కొడుతున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాడిస్ట్ విధానాలను ప్రభుత్వం అవలంబిస్తుందని మండిపడ్డారు మరో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పోలవరానికి వరదలు వచ్చినప్పుడు ఎక్కడా ప్రజలు ఇబ్బందులు పడలేదన్నారు. చంద్రబాబు నివాసంలోకి నీళ్లు రావాలని నీటిని నిలిపి దిగువకు విడుదల చేసారని ఆరోపించారు. వరదలపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కనీసం రివ్యూ చెయ్యలేదని, ఏపీలో ప్రభుత్వం ఉందా అని టీడీపీనేతలు విమర్శించారు.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!
4 hours ago

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం
5 hours ago

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?
5 hours ago

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
10 hours ago

వరస్ట్ సీఎంలలో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే
12 hours ago

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా
13 hours ago

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?
14 hours ago

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్
14 hours ago

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?
15 hours ago

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?
16 hours ago
ఇంకా