కోడెలకు కొత్త తలనొప్పులు..!
08-08-201908-08-2019 10:43:10 IST
Updated On 08-08-2019 15:24:18 ISTUpdated On 08-08-20192019-08-08T05:13:10.847Z08-08-2019 2019-08-08T05:13:08.723Z - 2019-08-08T09:54:18.241Z - 08-08-2019

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు మరిన్ని తలనొప్పులు మొదలయ్యాయి. రెండు నెలల క్రితం వరకు తాను శాసించిన నియోజకవర్గాల్లోనే ఇప్పుడు వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. తన మాట జవదాటని నేతలే ఇప్పుడు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. ఓ వైపు వరుసగా చుట్టుకుంటున్న కేసులకు ఇప్పుడు సొంత పార్టీలో అసమ్మతి రేగడంతో ఆయన రాజకీయ జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్నారు.
ఐదేళ్ల పాటు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన కోడెల శివప్రసాదరావు తీవ్ర వ్యతిరేకతనే మూటగట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన కుమారుడు కోడెల శివరాం, కూతురు విజయలక్ష్మీ నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో పార్టీలోనే అసంతృప్తి రేగింది. ఇక, రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని ఆరోపణలు కోడెల కుటుంబంపైనే వచ్చాయి.
సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు, కూతురు వ్యాపారుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారని, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకున్నారని, ఉద్యోగాలు ఇప్పిస్తారని డబ్బులు తీసుకొని మోసం చేశారని అనేక ఆరోపణలు వస్తున్నాయి. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ బయటకు రాకపోయినా వైసీపీ అధికారంలోకి రాగానే ఒక్కొక్కరుగా బయటకు వచ్చి కోడెల కుటుంబంపై ఫిర్యాదులు చేస్తున్నారు.
దీంతో ఇప్పటికే వీరి కుటుంబంపై గుంటూరు జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులన్నీ వైసీపీ కక్షపూరితంగా నమోదు చేయిస్తోందని కోడెల చెబుతున్నారు. ఈ విషయంలో కోడెలకు తెలుగుదేశం పార్టీ నుంచే సహకారం అందలేదు. కోడెల కుటుంబంపై వరుసగా కేసులు నమోదు కావడాన్ని పార్టీ నుంచి ఎవరూ పెద్దగా ఖండించలేదు. పైగా ఒకరిద్దరు పార్టీ కార్యకర్తలను సైతం మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి.
పార్టీ నుంచి తనకు మద్దతు లభించకపోయినా కోడెల సైలెంట్‌గా ఉన్నారు. తాజాగా, నియోజకవర్గంలో కోడెలకు వ్యతిరేకంగా గ్రూపు బలపడుతోంది. ఇప్పటికే వారు ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నారు. ఇక, సత్తెనపల్లి ఇంఛార్జిగా కోడెలను తప్పించి మరొకరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రెండు వందల మంది కార్యకర్తలు చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టారు.
కోడెలను తప్పించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మళ్లీ ఎదురుదెబ్బ తప్పదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు ముందే కోడెలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, వీరు చంద్రబాబును కలవడానికి ముందే కోడెల శివప్రసాదరావు వచ్చి చంద్రబాబును కలిశారు. కొందరు తన మీద కావాలనే కుట్రలు చేస్తున్నారని చంద్రబాబుకు వివరణ ఇచ్చారు. అయితే, చంద్రబాబు కోడెలకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు. తర్వాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
తర్వాత కోడెలకు వ్యతిరేకవర్గ నేతలతో మాట్లాడిన చంద్రబాబు త్వరలోనే కోడెల వ్యవహారాన్ని త్వరలోనే తేలుస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు సైతం కోడెల కుటుంబం గత ఐదేళ్లుగా వ్యవహరించిన శైలిపై వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఓ వైపు కేసులు.. మరో వైపు క్యాడర్లో, అధినేత వద్ద వ్యతిరేకతతో కోడెల శివప్రసాదరావు రాజకీయంగా గడ్డుకాలాన్ని ఎదుర్కుంటున్నారు.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!
3 hours ago

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం
4 hours ago

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?
5 hours ago

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
9 hours ago

వరస్ట్ సీఎంలలో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే
11 hours ago

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా
12 hours ago

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?
13 hours ago

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్
14 hours ago

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?
15 hours ago

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?
15 hours ago
ఇంకా