newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

కోటి పరిహారం అసాధారణం.. సీఎం జగన్‌పై బీజేపీ నేతల ప్రశంసలు

08-05-202008-05-2020 09:00:14 IST
Updated On 08-05-2020 10:07:54 ISTUpdated On 08-05-20202020-05-08T03:30:14.413Z08-05-2020 2020-05-08T03:30:12.627Z - 2020-05-08T04:37:54.095Z - 08-05-2020

కోటి పరిహారం అసాధారణం.. సీఎం జగన్‌పై బీజేపీ నేతల ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత మూడునెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాకపుట్టిస్తున్న అన్ని సమస్యలూ విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటనతో గాలికెగిరిపోయినట్లయింది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి చర్యనూ ప్రతికూల దృష్టితో చూస్తూ విమర్శల దాడి చేస్తూవస్తున్న ప్రతిపక్షం, బీజేపీ గ్యాస్ లీక్ బాధితులకు ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారం దిగ్భ్రాంతి కలిగించింది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వంపై, ప్రభుత్వాధినేతపై వరుసగా విమర్శల దాడికి దిగుతూ వస్తున్న బీజేపీ నేతలు సీఎం ఔదార్యం పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నుంచి విష్ణుకుమార్ రాజు, లక్ష్మీపతిరాజా, పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ ఇది అసాధారణ పరిహారం అంటూ సీఎంపై తమ బాణీ మార్చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్‌ లీకేజీ బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు. మానవ తప్పిదం వలనే ప్రమాదం జరిగిందని అన్నారు. వైజాగ్‌లో జరిగిన సంఘటన దురదృష్టకరమని, అలారం మోగించకపోవడం యాజమాన్యం తప్పుగా ఆయన పేర్కొన్నారు.

ఎంతో మంది సీఎంలను చూశాను కానీ..  విష్ణుకుమార్‌ రాజు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించడం సామాన్య విషయం కాదని బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు అన్నారు. తాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ పెద్ద మొత్తంలో, అక్కడికక్కడే ప్యాకేజ్ ప్రకటించడం ఎవ్వరూ చేయలేదని చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌కు అభినందనలు తెలియజేశారు. ఇది రాజకీయం కాదని, మాట్లాడటానికి కానీ.. విమర్శలు చేయడానికి కానీ వీలు లేకుండా, బాధిత కుటుంబాలతో పాటు వారి తర్వాత తరానికి కూడా ఆర్ధిక ఇబ్బందులు లేకుండా సీఎం చేయూత నివ్వడాన్ని అభినందిస్తున్నానన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైజాగ్ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరికి కోటి రూపాయలు ప్రకటించడం హర్షణీయమని బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న వాళ్లకు 10 లక్షలు, హాస్పిటల్‌లో చికిత్స పొందే వారికి లక్ష రూపాయలు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ సంఘటన జరగటం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన భగవంతున్ని ప్రార్థించారు. 

కాగా అమరావతి  ఎల్‌జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోటి రూపాయలు పరిహారం ప్రకటించటం హర్షణీయమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. ప్రతి ఇంటికి 10 వేలు ఇవ్వాలన్న నిర్ణయం కష్టకాలంలో ఓ గొప్ప సహాయంగా ఆయన పేర్కొన్నారు. బాధిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు అవసరమని అన్నారు.

కాగా సామాన్యులు సైతం జగన్ ప్రకటించిన పరిహారం పట్ల ఆశ్చర్యం వ్యక్తపరుస్తూనే స్వాగతం పలికారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన సీఎంలు ఇలాంటి విపత్తుల్లో 5 నుంచి 10 లక్షల పరిహారం ప్రకటించేవారని, కానీ బాధిత కుటుంబాలకు ఇది ఏమాత్రం ఆర్థికపరమైన నిలకడను అందించేదికాదని, ఇప్పుడు సీఎం జగన్ ప్రకటించిన భారీ పరిహారం నమ్మశక్యంగా లేదని స్థానికులు కొనియాడుతున్నారు. సీఎం పాలకుడిగా ఈ పరిహారం ప్రకటించలేదని హృదయంతో ప్రకటించారని వారు పేర్కొన్నారు.

కాగా విశాఖ గ్యాస్ లీక్ బాధిత కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారంపై వైఎస్ జగన్ చేసిన ప్రకటన రెండు రాష్ట్రాల ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

నాటి జగన్ డిమాండే నేడు ఆచరణలో అమలైందా?విశాఖలో స్టెరీస్ గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్  వ్యక్తపరిచిన స్పందన ప్రతిపక్షాలనే కాకుండా యావత్ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే గ్యాస్ లీకేజీ సందర్భంగా మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల సహాయం ప్రకటించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంలో తండ్రిలాగే మొండి పట్టుతో ఉంటారని మరోసారి రుజువైంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నగరం గ్యాస్‌ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ చేసిన ఆయన.. వైజాగ్‌ గ్యాస్‌ లీకేజీ మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం అందించి ఆచరణలో పెట్టారు.  

2014 జూన్‌ నెలలో తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం.. నగరం గ్రామంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలి పలువురు మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించిన ఆయన దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ఎంతమాత్రం సరిపోదని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే గెయిల్‌కు కానీ, ఓఎన్జీసీకి కానీ ఒంట్లో భయం పుట్టాలంటే కనీసం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

నగరం ప్రమాదం జరిగిన దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ గురువారం వైజాగ్‌ గ్యాస్‌ లీక్‌ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దుర్ఘటనపై వెను వెంటనే స్పందించటమే కాకుండా.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తగిన విధంగా సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. 

అనంతరం బాధితులను పరామర్శించి, మృతుల కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారందరికీ రూ.10 లక్షలు, బాధిత గ్రామాల్లోని 15 వేలమందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు, జంతు నష్టం జరిగిన వారిని ఆదుకుంటామని చెప్పారు. ఒక్కో జంతువుకు రూ.25 వేల నష్టపరిహారం, ఎల్జీ కంపెనీలో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle