newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

కేంద్రంతో సమరానికి జ‌గ‌న్ సై..?

19-07-201919-07-2019 08:00:35 IST
Updated On 20-07-2019 13:37:27 ISTUpdated On 20-07-20192019-07-19T02:30:35.963Z19-07-2019 2019-07-19T02:30:31.437Z - 2019-07-20T08:07:27.244Z - 20-07-2019

కేంద్రంతో సమరానికి జ‌గ‌న్ సై..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌గా ఉండాల‌ని ఇంత‌కాలంగా భావిస్తున్న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆలోచ‌న‌లు క్ర‌మంగా మారుతున్నాయా అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇటీవ‌లి ప‌రిణామాలు ఇదే సూచిస్తున్నాయి. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం మొకాల‌డ్డుతుండ‌టంతో జ‌గ‌న్ కూడా కేంద్ర ప్ర‌భుత్వంపై అసంతృప్తితో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 

తాను తీసుకున్న నిర్ణ‌యాల‌ను అమ‌లు చేయ‌డానికి అవ‌స‌ర‌మైతే కేంద్రాన్ని సైతం విభేదించేందుకు జ‌గ‌న్ వెనుకాడ‌బోర‌ని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ హ‌యాంలో విచ్చ‌ల‌విడిగా అవినీతి జ‌రిగింద‌ని గ‌త ఐదేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా పోల‌వ‌రం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారంలో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌నేది ఆ పార్టీ ఆరోప‌ణ‌. 

ఇప్పుడు అధికారంలోకి రావ‌డంతో మొద‌టి రోజు నుంచి వీట‌న్నింటిపై స‌మీక్ష జ‌రుపుతామ‌ని జ‌గ‌న్ ప‌లుమార్లు ప్ర‌క‌టించారు. ముందుగా ఆయ‌న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌పై విచార‌ణ చేయాల‌ని నిర్ణ‌యించారు. వెంట‌నే కేంద్ర ఇంద‌న శాఖ కార్య‌ద‌ర్శి నుంచి సీఎస్‌కు ఓ లేఖ అందింది. ఈ ఒప్పందాల‌ను స‌మీక్షిస్తే పెట్టుబ‌డులు ఆగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని, కాబ‌ట్టి ముఖ్య‌మంత్రి తన నిర్ణ‌యాన్ని మార్చుకునేలా చూడాల‌నేది ఆ లేఖ సారాంశం. 

అయినా వెన‌క్కు త‌గ్గ‌ని జ‌గ‌న్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తిరుప‌తి వ‌చ్చిన‌ప్పుడు స్వ‌యంగా ఆయ‌నకు విష‌యం చెప్పి ఆమోదం పొందార‌ని తెలుస్తోంది. ప్ర‌ధాని ఇచ్చిన మాట‌తోనే ఆయ‌న ఓ క‌మిటీని కూడా ఏర్పాటు చేశారు. క‌మిటీ ఏర్పాటు విష‌యం తెలుసుకున్న కేంద్ర‌మంత్రి ఈసారి నేరుగా జ‌గ‌న్‌కు లేఖ రాశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల జోలికి వెళ్ల‌వ‌ద్ద‌ని ఆయ‌న ఈసారి నేరుగా చెప్పారు. 

దీంతో జ‌గ‌న్ కొంత అసంతృప్తికి గుర‌య్యార‌ని తెలుస్తోంది. ఈ విష‌యంలో వెన‌క్కు త‌గ్గ‌వ‌ద్ద‌ని భావించిన ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు అజ‌య క‌ల్లాంతో ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించుకున్నారు. త‌ర్వాత పోల‌వ‌రం విష‌యంలోనూ లోక్‌స‌భ‌లో జ‌గ‌న్ వాద‌న‌కు భిన్నంగా కేంద్ర‌మంత్రి మాట్లాడారు.

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా పోల‌వ‌రం నిర్మాణంలో ఎటువంటి ఆరోప‌ణ‌లు, ఆధారాలు లేవ‌ని కేంద్ర‌మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ రెండు అంశాలు టీడీపీ వారికి ఆయుధంగా మారాయి. చూశారా.. త‌మ హ‌యాంలో ఎటువంటి త‌ప్పులూ జ‌ర‌గ‌లేద‌ని, వైసీపీ కావాల‌నే త‌మ‌కు అవినీతి మ‌ర‌క అంటించాల‌ని భావిస్తుంద‌ని టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్నారు.

ఇది వైసీపీకి ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో కేంద్రం ఒప్పుకున్నా.. ఒప్పుకోక‌పోయినా తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అవినీతిపై విచార‌ణ జ‌రిపించాల్సిందేన‌ని, ఇందుకు గానూ వేసిన కేబినెట్ స‌బ్ క‌మిటీ నివేదిక అంద‌గానే విచార‌ణ ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక‌, ప్ర‌త్యేక హోదా స‌హా విభ‌జ‌న హామీల అమ‌లులోనూ కేంద్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని, పైగా రాష్ట్ర బీజేపీ త‌మ‌పై ఆరోప‌ణ‌లు ప్రారంభించినందున ఇక తాను కూడా బీజేపీని ఢీకొట్టేందుకు సిద్ధప‌డుతున్నార‌ని తెలుస్తోంది. మ‌రి, పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారంలో ఉన్న న‌రేంద్ర మోడీని జ‌గ‌న్ విభేదిస్తారా చూడాలి.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle