కాపీ కొట్టు .. ఓటు పట్టు- ఏపీ బడ్జెట్
05-02-201905-02-2019 14:52:31 IST
Updated On 05-02-2019 14:56:13 ISTUpdated On 05-02-20192019-02-05T09:22:31.270Z05-02-2019 2019-02-05T09:19:39.055Z - 2019-02-05T09:26:13.522Z - 05-02-2019

ఎన్నికల వేళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లు అన్నీ ఒకేబాటలో పయనిస్తున్నాయి. ఒకరి బడ్జెట్లను మరొకరు కాపీ కొట్టి మరీ బడ్జెట్లో వివిధ జనాకర్షక పథకాలను ప్రవేశ పెడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం తరహాలోనే ఏపీ కూడా రైతులకోసం ఒక పథకాన్ని ప్రవేశపెడుతోంది. కేంద్ర బడ్జెట్ తరహాలోనే ఏపీ...అన్నదాతకు అగ్రతాంబూలం ఇచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 26 వేల 77. 53కోట్లతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో రైతుల కోసం ‘అన్నదాత సుఖీభవ’ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. ఈ పథకానికి రూ. 5 వేల కోట్లు కేటాయించారు. అలాగే పలు కొత్త పథకాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం సంక్షేమ పథకాలకు 65,486 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈసారి బడ్జెట్లో ఆరు కొత్త పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టారు. ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. నిరుద్యోగ భృతిని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి యనమల రామకృష్ణుడు నిరుద్యోగ భృతిని రూ.1000 నుంచి రూ.2000లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 11వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. అమరావతిలో వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టానన్నారు యనమల. మహిళా సాధికారత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అని.. 20 ఏళ్ల క్రితమే మహిళా పొదుపు సంఘాలను ఆయన ఏర్పాటు చేశారని యనమల గుర్తు చేశారు. వెలుగు పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమమని, ఆ పథకంలో ప్రస్తుతం 94 లక్షల మంది మహిళలు ఉన్నారని చెప్పారు. అంతకుముందు బడ్జెట్‌పై చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహించారు.ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్నివర్గాలను సంతృప్తి పరిచేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉందన్నారు యనమల. ఇందులో పెట్టుబడి వ్యయం రూ.29,596 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2099 కోట్లు , ఆర్థిక లోటు అంచనా రూ.32390.68 కోట్లుగా చూపించారు. ఏప్రెల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇది. బడ్జెట్లో ముఖ్యాంశాలు..కేటాయింపులు: వ్యవసాయానికి రూ. 12, 732 కోట్లు, బీసీ వెల్ఫేర్ రూ.8,242, అటవీపర్యావరణానికి రూ. 491 కోట్లు ఉన్నత విద్యకు రూ. 3,171 కోట్లు, ఇంధన మరియు ఇన్ఫ్రాస్ట్రక్షర్ రూ.5,473, సెకండరీ ఎడ్యుకేషన్ రూ. 22,783 పౌరసరఫరాలకు రూ. 3,763 కోట్లు, ఆర్థికశాఖకు రూ. 51, 841 కోట్లు, సాధారణపరిపాలన శాఖకు.. రూ.1,117 వైద్యారోగ్యశాఖకు రూ. 10,032, హోంశాఖకు రూ.6,397 కోట్లు, గృహనిర్మాణశాఖకు రూ.4079 జలవనరులశాఖకు- రూ. 16,852 కోట్లు, పరిశ్రమలశాఖకు 4,114 కోట్లు, ఐటీకి 1006 కోట్లు, కార్మిక ఉపాధి కల్పనకు రూ.1225 కోట్లు మైనార్టీ వెల్ఫేర్‌కు రూ. 1308 కోట్లు, న్యాయశాఖకు రూ.918 కోట్లు, అసెంబ్లీకి రూ. 149 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు రూ.7979 కోట్లు ప్లానింగ్‌కు రూ.1403 కోట్లు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ రూ. 35,182 కోట్లు రెవెన్యూశాఖకు రూ. 5546 కోట్లు, రియల్ టైమ్ గవర్నెన్స్ రూ. 172 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ రూ.458 కోట్లు సోషల్ వెల్ఫేర్‌కు రూ. 6861 కోట్లు, రోడ్లు భవనాలశాఖకు రూ. 5382 కోట్లు, డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 150 కోట్లు, క్షత్రియ కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లు మహిళాశిశు సంక్షేమశాఖకు రూ. 3408 కోట్లు, యువజన క్రీడలు రూ. 1982 కోట్లు, చిన్నమధ్యతరహా పరిశ్రమలకు రూ. 400 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి రూ. 1000 కోట్లు, యాంత్రీకరణకు రూ. 300 కోట్లు, అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు, చేనేతలకు రూ. 225 కోట్లు, మత్స్యశాఖ అభివృద్ధికి రూ. 100 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ. 14,367 కోట్లు, 9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ. 156 కోట్లు ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 5,385 కోట్లు, బీసీ సబ్‌ప్లాన్ కింద రూ. 16,226 కోట్లు, పెన్షన్ కింద వృద్ధాప్య, వితంతువులకు రూ. 10,401 కోట్లు మైనార్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 1,304 కోట్లు, పసుపు- కుంకుమ కింద రూ. 4 వేల కోట్లు, ఎన్టీఆర్ విదేశీ విద్యకు రూ. 100 కోట్లు బీసీల కార్పొరేషన్‌కు రూ. 3 వేల కోట్లు, ముఖ్యమంత్రి యువనేస్తానికి రూ. 1200 కోట్లు, చంద్రన్న బీమాకు రూ. 354 కోట్లు డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ. 1100 కోట్లు, చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ. 175 కోట్లు చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ. 128 కోట్లు, మైనార్టీలకు దుల్కన్ పథకం కింద రూ. 100 కోట్లు, మొత్తం మీద ఎన్నికల వేళ అన్నివర్గాల ఓట్లకు గాలం వేస్తూ కేటాయింపులు జరిపారు యనమల. ఈ నిధులతో ఎన్ని ఓట్లు పడతాయో చూద్దాం.

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’
2 hours ago

సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్
5 hours ago

దిశ ఎన్ కౌంటర్ ఎఫెక్ట్: హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య
5 hours ago

దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు
6 hours ago

ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి
6 hours ago

తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!
7 hours ago

అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?
8 hours ago

మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక
8 hours ago

రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం
10 hours ago

నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్హెచ్ఆర్సీపై రోజా ధ్వజం
11 hours ago
ఇంకా