newssting
BITING NEWS :
*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

కరోనా కట్టడిలో కొంపముంచిన మత ప్రచారాలు!

29-03-202029-03-2020 12:03:29 IST
2020-03-29T06:33:29.310Z29-03-2020 2020-03-29T06:33:26.063Z - - 04-06-2020

కరోనా కట్టడిలో కొంపముంచిన మత ప్రచారాలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అటు కేంద్రం, ఇటు మన తెలుగు రాష్ట్రాలు కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఈ శ్రమేదో మార్చి తొలి వారం నుండే మొదలు పెడితే అసలు ఒకటీ ఆరా కేసులతో మన రాష్ట్రాలు బయటపడేదనే అభిప్రాయాలూ ఇప్పుడు వినిపిస్తున్నాయి. గతం గతః అనుకున్న ప్రభుత్వాలు ఇప్పుడు మాత్రం ఎక్కడికక్కడ కఠినంగా వ్యవహరిస్తూ సామజిక దూరాన్ని అమలు చేస్తున్నాయి.

సోషల్ డిస్టెన్స్, లాక్ డౌన్ ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఏప్రిల్ నెలాఖరుకి తెలిసే అవకాశం ఉండగా ప్రస్తుతానికి అయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు మన దగ్గర ఉన్న ఒకేఒక్క ఆయుధం మాత్రం సామజిక దూరం పాటించడమే. కాగా, ఇప్పటి వరకు నమోదైన కేసులు.. కట్టడి చేయడంలో కూడా శ్రమించాల్సి వస్తున్న విషయం ఏదైనా ఉందంటే అది మతపరమైన కార్యక్రమాలే అంటున్నారు.

పరిస్థితిలను నిశితంగా గమనిస్తే అది కూడా నిజమేనని అనిపించకమానదు. మార్చి 14వ తేదీన ఢిల్లీలో ఓ మతపరమైన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు హాజరుకాగా మన తెలుగు రాష్టాల నుండి కూడా కొందరు హాజరయ్యారు. అయితే ఆ హాజరైన వారిలో ఎక్కువ శాతం మందికి కరోనా పాజిటివ్ గా తేలుతుండడంతో సంచలనంగా మారుతుంది.

తెలంగాణ కరోనా తొలి కరోనా మరణం కూడా ఆ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వ్యక్తే కాగా అయన చనిపోయిన తర్వాత కానీ అయనలో లక్షణాలను కనుగొనలేదు. ఇక ఏపీలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా ఆ కార్యక్రమానికే వెళ్లి వచ్చి స్థానికంగా మరో వ్యక్తికి అంటించాడు. ప్రకాశం జిల్లాలో పాజిటివ్ కేసు కూడా ఆ కార్యక్రమం నుండి వచ్చిందే.

అయితే, విదేశాల నుండి వచ్చిన పాజిటివ్ వ్యక్తుల ద్వారా వారి కుటుంబ సభ్యులకు వ్యాధి సోకింది కూడా ఇప్పటి వరకు చాలా తక్కువే. అలాంటిది ఒక్క మతపరమైన కార్యమానికి వెళ్లిన వారిలో తొంబై శాతం మందికి పాజిటివ్ రావడం ఏమిటో ఎవరికీ అర్ధం కావడంలేదు. కరీంనగర్ లో కరోనా కలకలంలో కూడా విదేశాల నుండి వచ్చిన వ్యక్తులతో స్థానికంగా ఒక్క వ్యక్తికి మాత్రమే సోకింది

అలాంటిది ఢిల్లీ కార్యక్రమంకి వెళ్లిన వారికి తీవ్రంగా సోకడం ఆందోళనగా మారింది. ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో లాక్ డౌన్ నడుస్తుండగా ఎలాంటి ప్రార్ధనా మందిరాలు, దేవాలయాలలో కూడా దర్శనాలు అందుబాటులో లేవు. కానీ కొందరు యథేచ్ఛగా ప్రార్ధనా మందిరాలలో ప్రార్థనలకు తెరతీస్తున్నారు. ఇది కూడా కట్టడిలో తీవ్ర ఇబ్బందిగా మారుతుంది.

పలుచోట్ల మత ప్రచారకులు.. కరోనాను కూడా దేవుడితో ముడిపెట్టి ప్రార్ధనలు చేస్తే వైరస్ దరిచేరదని అమాయక ప్రజలను నమ్మించి ఈ పనిచేస్తున్నట్లుగా వినిపిస్తుంది. ఇక మొన్న శుక్రవారం ఒకటీ రెండు చోట్ల మందిరాలలో ప్రార్ధనలు చేస్తున్న సమయం పోలీసులు అటాక్ చేసి చెదరగొట్టారు. కనిపించకుండా ఇది రెండు రాష్ట్రాలలో కొన్నిచోట్ల జరుగుతూనే ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

అయితే, ప్రభుత్వాలు ప్రజల కోసమే ఈ కట్టడిని కఠినంగా అమలుచేస్తున్నా.. ప్రజలకున్న మనోభావాలతో కొందరు మత పెద్దలు, ప్రచారకులు ఆటలాడుకుంటున్నారు. అయితే, వీరి ప్రచార మాయలో పడి మీరు, మీతో పాటు మీ చుట్టూ ఉన్నవాళ్ళ జీవితాలను పణంగా పెట్టవద్దని మేధావులు వేడుకుంటున్నారు. దేశాధినేతలు, ప్రపంచ అగ్ర రాజ్యాలే ఈ మహమ్మారికి వణికిపోతున్నాయని.. వారందరికీ ప్రార్ధనలు చేతకాక కాదు.. దేవుడి కరుణ వారిపై లేక కాదు.. అర్ధం చేసుకొని మసలుకోవాలి.

 

హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

   32 minutes ago


మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

   2 hours ago


ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

   4 hours ago


ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

   4 hours ago


కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

   4 hours ago


ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

   5 hours ago


పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

   6 hours ago


కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

   6 hours ago


కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

   18 hours ago


 రాబోయే 24 గంటలు జాగ్రత్త అవసరం

రాబోయే 24 గంటలు జాగ్రత్త అవసరం

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle