newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు

28-03-202028-03-2020 17:56:23 IST
2020-03-28T12:26:23.496Z28-03-2020 2020-03-28T12:26:11.930Z - - 01-06-2020

కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పకడ్బందీగా చర్యలు చేపట్టాగలిగామని, సామాజిక దూరాన్ని ఎవరికి వారు స్వీయ నియంత్రణ చర్యలు తీసుకున్నామని మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాథ్, కె.కన్నబాబు, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, హరికృష్ణలు పేర్కొన్నారు.

ఆర్ అండ్ బి భవనం ప్రాంగణంలో మంత్రుల బృందం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తిని నివారణకు కఠినమైన కొన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్ రాష్ట్ర ప్రజా రవాణా పై ప్రజల్లో అవగాహన కలుగ చెయ్యాల్సి ఉందన్నారు. అందులో భాగంగా వాస్తవ పరిస్థితులను  వివరించి,  తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాల్సి ఉందన్నారు. 

ఈ విషయంలో ప్రజల్లోకి భయాందోళనలను దూరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించారు. రాష్ట్రంలో 104 ద్వారా వైద్య సేవలు ,  1902  ద్వారా  నిత్యావసర సరుకుల పంపిణీ, ధరల నియంత్రణ చర్యలను పకడ్బందీగా చేపట్టడం జరుగుతుందన్నారు. లాక్ డౌన్ అమలుకు చేపడుతున్న కార్యక్రమాలను ప్రసార సాధనాల ద్వారా ప్రజల్లోకి సామాజిక బాధ్యతగా తీసుకుని వెళ్లాలని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది అన్నది వాస్తవం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపడ్డం ద్వారా ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకుని రాగలిగామన్నారు.   

కేంద్రం  దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటన చేసిందన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమల్లోకి తీసుకొచ్చామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని సామాజిక దూరం పాటించడం ద్వారా మాత్రమే నియంత్రణ లోకి తీసుకుని రాగలుగుతామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న మనవారికి తగిన షెల్టర్ , ఇతర సదుపాయాలు కల్పించాలని కోరడం జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి తగిన విధంగా షెల్టర్ కల్పించాలని కలెక్టర్ లను, ఎస్పీలకు స్పష్టం చేశామన్నారు. నిత్యావసర సామాగ్రి, అత్యవసర సేవలు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తీసుకుంటామన్నారు.

వైరస్ వ్యాప్తిని నివారణకు సామాజిక దూరం ఏకైక మార్గమని, ఇందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సహకారాన్ని అందించాల్సి ఉందన్నారు. ఇటలీ, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి ని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని, మనకి మనమే స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. నిత్యావసర వస్తువుల రవాణా, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం, వాటిని కోల్డ్ స్టోరేజ్ గురించి సమావేశంలో చర్చించారు. ఆక్వా సాగు, చేపలు, హార్టికల్చర్ పంటల ద్వారా వచ్చినా ఉత్పత్తులకు తగిన కోల్డ్ స్టోరేజ్, ఎగుమతులపై దృష్టి సారించాలన్నారు. 

రైతులకు చేదోడువాదోడుగా నిలవాల్సిన అవసరం ఉందని ,  ఆదిశలో జిల్లా కలెక్టర్లు మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం తప్పనిసరి గా మార్గదర్శకాలు జారీ చెయ్యాల్సి ఉందన్నారు. వరి పంట కోతకు వచ్చిందని, వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన యంత్ర పరికరాలు రవాణాపై ఎటువంటి నిషేధం లేదని తెలియచేసారు.

రాష్ట్రంలోని పరిస్థితులు, ఇతర దేశాలలో రవాణా, ఎగుమతులపై అమలు చేస్తున్న పద్ధతులపై  అధ్యయనం చేయాలని మంత్రులు సూచనలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న  సూచనలు పరిగణనలోకి తీసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కంటే, పట్టణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నదని పేర్కొన్నారు. ఆ దిశలో ఇంటింటి సర్వే ప్రతి రోజు చేపట్టే ఆలోచన చెయ్యాల్సి ఉందన్నారు. 

ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో ప్రజలను ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇస్తున్న అనుమతి సమయం నియంత్రణ చెయ్యాల్సి ఉందన్నారు. ప్రతి రెండు కిలోమీటర్ల పరిధిలో రైతు బజార్ లను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. వీటికి అదనంగా మొబైల్ రైతు బజార్లు అందుబాటులో ఉంటాయని మంత్రులు పేర్కొన్నారు. పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని,  డిజిపి గౌతమ్ సవాంగ్ , ఉన్నతాధికారులు కేఎస్ జవహర్ రెడ్డి, పివి రమేష్, గిరిజా శంకర్, మధుసూదన్, గోపాలకృష్ణ ద్వివేది,   జె.శ్యామల రావు, టీ విజయ కుమార్ రెడ్డి, కార్తికేయ మిశ్రా, విజయకుమార్, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఏడాది పాలనలో అన్నీ వైఫల్యాలే... జగన్ పై కన్నా విమర్శలు

ఏడాది పాలనలో అన్నీ వైఫల్యాలే... జగన్ పై కన్నా విమర్శలు

   3 minutes ago


వైసీపీకి స్వ‌ప‌క్షంలో విప‌క్ష నేత‌గా మారిన‌ ఎంపీ

వైసీపీకి స్వ‌ప‌క్షంలో విప‌క్ష నేత‌గా మారిన‌ ఎంపీ

   an hour ago


త్రిశంకు స్వర్గంలో ఎన్నికల కమిషనర్.. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం

త్రిశంకు స్వర్గంలో ఎన్నికల కమిషనర్.. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం

   3 hours ago


 గిరిజనుల చెంతకు చేరని సంక్షేమ ఫలాలు

గిరిజనుల చెంతకు చేరని సంక్షేమ ఫలాలు

   6 hours ago


ఏపీ వెళ్ళాలంటే ‘స్పందన’లో నమోదుచేయాల్సిందే!

ఏపీ వెళ్ళాలంటే ‘స్పందన’లో నమోదుచేయాల్సిందే!

   7 hours ago


జగన్ పాలనపై ‘యాత్ర’ దర్శకుడి వీడియో వైరల్

జగన్ పాలనపై ‘యాత్ర’ దర్శకుడి వీడియో వైరల్

   7 hours ago


నల్లగొండలో ఎంపీ వర్సెస్ మంత్రి.. మాటల తూటాలు

నల్లగొండలో ఎంపీ వర్సెస్ మంత్రి.. మాటల తూటాలు

   9 hours ago


తెలంగాణలో ఒక్కరోజే 199 కేసులు.. అదుపు తప్పుతున్న తెలుగు రాష్ట్రాలు

తెలంగాణలో ఒక్కరోజే 199 కేసులు.. అదుపు తప్పుతున్న తెలుగు రాష్ట్రాలు

   10 hours ago


కరోనా విరామం.. మళ్లీ టీపీసీసీ చీఫ్ రాజకీయం!

కరోనా విరామం.. మళ్లీ టీపీసీసీ చీఫ్ రాజకీయం!

   12 hours ago


డజన్ల కొద్ది సలహాదారులు.. కక్ష్యసాధింపు కోసమేనా?

డజన్ల కొద్ది సలహాదారులు.. కక్ష్యసాధింపు కోసమేనా?

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle