ఏపీ రైతు సంక్షేమ బడ్జెట్.. రూ.28,866.23 కోట్లు
12-07-201912-07-2019 15:18:17 IST
Updated On 12-07-2019 16:07:36 ISTUpdated On 12-07-20192019-07-12T09:48:17.823Z12-07-2019 2019-07-12T09:48:15.718Z - 2019-07-12T10:37:36.425Z - 12-07-2019

ఈసారి వ్యవసాయ బడ్జెట్‌ని రైతు సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వారం క్రితమే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించిన రాష్ట్రప్రభుత్వం రైతులకు దీర్ఘకాలంగా మేలు చేసేలా వ్యవసాయ బడ్జెట్ సభ ముందుకు తెచ్చింది. ఈ బడ్జెట్ ద్వారా తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అంకితమవుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఆయన వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబు సోదరుడి హఠాన్మరణంతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం మంత్రి బొత్సకు దక్కింది. ప్రకృతి విపత్తుల వల్ల రైతులు బాగా నష్టపోతున్నందున ప్రకృతి సహాయ నిధిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మొత్తం రూ.28,866.23 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ రూపొందించారు. ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ.27,946.65 కోట్లు కాగా.. పెట్టుబడి వ్యయం రూ.919.58 కోట్లుగా ఉంది. వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి బొత్స. వ్యవసాయ బడ్జెట్ హైలెట్స్: * రైతులకు విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు కేటాయింపు. ఎరువులు, పురుగు మందులు పూర్తిస్థాయిలో పరీక్షలు * ఉద్యానవన శాఖకు రూ. 1532 కోట్ఉల కేటాయింపు * ఆయిల్ ఫాం రైతులకు ధరల్లో వ్యత్యాసం తగ్గించేందుకు అదనంగా రూ.80 కోట్లు కేటాయింపు. ఆయిల్‌ఫాం తోటల సాగు ప్రోత్సాహానికి రూ.65.15 కోట్లు * ఉద్యాన పంటల సమగ్రాభివృద్ధికి రూ.200 కోట్లు * రైతులకు తుంపర, బిందు సేద్య పథకాల కోసం రూ.1105.66 కోట్లు * సహకార రంగం అభివృద్ధి కోసం రెవెన్యూ వ్యయం రూ.174.64 కోట్లు * సహకార రంగం అభివృద్ధి కోసం పెట్టుబడి వ్యయం రూ.60 కోట్లు * 2019-20లో రైతులకు సహకార స్వల్ప కాలిక రుణాల కింద రూ.12వేల కోట్లు కేటాయింపు * రైతులకు సహకార దీర్ఘకాలిక రుణల కింద రూ.1500 కోట్లు * కౌలు రైతులకు రూ.1200 కోట్లు * ప్రతి రైతు కుటుంబానికి వైఎస్ఆర్ రైతు భరోసా కింద రూ.12,500.ఈ పథకంతో రాష్ట్రంలో 64.07లక్షల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం.

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’
2 hours ago

సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్
5 hours ago

దిశ ఎన్ కౌంటర్ ఎఫెక్ట్: హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య
5 hours ago

దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు
5 hours ago

ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి
6 hours ago

తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!
7 hours ago

అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?
7 hours ago

మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక
8 hours ago

రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం
10 hours ago

నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్హెచ్ఆర్సీపై రోజా ధ్వజం
11 hours ago
ఇంకా