newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ఱయాలు తప్పవా?

10-06-201910-06-2019 09:04:07 IST
Updated On 24-06-2019 13:01:02 ISTUpdated On 24-06-20192019-06-10T03:34:07.620Z10-06-2019 2019-06-10T03:32:43.311Z - 2019-06-24T07:31:02.169Z - 24-06-2019

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ఱయాలు తప్పవా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాష్ట్ర తొలి కేబినెట్ సోమవారం జరగనుంది. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక తొలి భేటీ కావడంతో ఈ సమావేశం కీలకంగా మారింది. ప్రధానంగా నవరత్నాలతో కూడిన మేనిఫెస్టో లక్ష్యంగా ఈ భేటీ జరగనుందని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులకు జారీ చేసారు. ఈ తొలి కేబినెట్ లో మొత్తం 8 అంశాలను ఆమోదించనున్నారు.

వృద్దాప్య పింఛన్ల పెంపు, ఆశా వర్కర్ల జీతాల పెంపు, ఏపీఎస్ఆర్టీసీ విలీనం, మున్సిపల్ శానిటరీ వర్కర్ల వేతనాల పెంపు, ఉద్యోగులకు ఐఆర్ పెంపు,  రైతు బంధు, అలాగే హోంగార్డు జీతాలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు పై వంటి అంశాలను కేబినెట్ లో చర్చించి ఆమోదించనున్నారు.ఎన్నికల ప్రణాళికలో వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏడాదికి ఒక్కో రైతు కుంటుంబానికి పెట్టుబడి సాయంగా 12,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. 

వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి అమలు చేస్తామని పేర్కొన్నప్పటికీ ఈ రబీ నుంచే అందివ్వాలని, ఈ మేరకు తొలి కేబినెట్‌లో ఆమోద ముద్ర వేయడానికి ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే వ్యవసాయ రంగం సమీక్షలో రబీ నుంచే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ మంత్రిమండలి సమావేశం ఆమోదించాల్సి ఉంది. అక్టోబర్‌ 15వ తేదీ నుంచి వైఎస్సార్‌ భరోసా పథకం అమలును పెద్ద ఎత్తున చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 

కేబినెట్ అజెండా ఇదేనా?

* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి, హోం గార్డులు, మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయం

* జూలై నుంచి వృద్ధులు, వితంతువులతో పాటు మత్స్యకారులు, చేనేత కార్మికులకు రూ.2,250, వికలాంగులకు రూ.3,000.. డయాలసిస్‌ రోగులకు రూ.3,500 నుంచి రూ.10 వేలకు పింఛన్‌ పెంపు 

*పింఛన్‌ అర్హత వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించాలని నిర్ణయం

* నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని ప్రభుత్వంలో ఏ విధంగా విలీనం చేయాలనే దానిపై నిర్ణయం 

*రాష్ట్రంలోని 42 వేల మంది ఆశా వర్కర్ల వేతనాలను రూ.3,000 నుంచి రూ.10 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ఆమోదం


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle