newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఏపీ కేబినెట్: ఈ మూడు శాఖలే కీలకం

09-06-201909-06-2019 08:54:28 IST
Updated On 24-06-2019 13:18:21 ISTUpdated On 24-06-20192019-06-09T03:24:28.729Z09-06-2019 2019-06-09T03:24:11.773Z - 2019-06-24T07:48:21.434Z - 24-06-2019

ఏపీ కేబినెట్: ఈ మూడు శాఖలే కీలకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గం కూర్పుపై బాగానే ఎక్సర్ సైజ్ చేశారు. అయితే కీలక శాఖల విషయంలో జగన్ ఏం ఆలోచించారో గానీ కొత్తవారికి పగ్గాలు అప్పగించారు. ఏపీలో మూడుశాఖలను కీలక శాఖలుగా చెబుతారు. అవి వైద్య ఆరోగ్యం, విద్యాశాఖ, పరిశ్రమలు. ఈ మూడింటిలో పెద్ద తలకాయలు కనిపించడంలేదు. తాజా మంత్రివర్గంలో వైద్యశాఖను ఆళ్ళ నానికి అప్పగించారు. ఇక మరో కీలక శాఖ విద్యామంత్రిగా ఆదిమూలపు సురేష్ ని ఎంపికచేశారు.

ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌), పీహెచ్‌డీ చేసిన ఆదిమూలపు సురేష్ విద్యాశాఖలో తనదైన ముద్రవేస్తారని జగన్ భావించి ఉండవచ్చు. ఇక బీకాం చదివిన ఆళ్ళనానికి వైద్యశాఖ కొత్తది, మరి మంత్రిగా ఆయనను వెనుక నుండి నడిపించేది ఎవరో తేలాల్చి ఉంది. రాష్ట్రంలో వైద్యశాఖ కీలకమయినది. ఎన్నో వివాదాలు కూడా ఈ శాఖ చుట్టూ ముసురుకుని ఉంటాయి. మరి ఆళ్ళనాని ఎలా నెగ్గుకుని వస్తారో చూడాలి.

నవ్యాంధ్రను ముందుకు నడిపించేవి పరిశ్రమలు. కొత్త రాజధాని ప్రాంతంలో వివిధ రకాల పరిశ్రమలు రావాలి. ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి.  ఇక పరిశ్రమల శాఖ విషయానికి వస్తే రాజకీయాల్లో కాకలు తీరిన మేకపాటి వారసుడు మేకపాటి గౌతమ్ రెడ్డిని పరిశ్రమలు వాణిజ్యం శాఖ వరించింది. వైసీపీలో ఎన్నికల నిర్వహణ, నిధులు, ఇతర విధులు నిర్వర్తించారు. జగన్ నమ్మకస్తుల్లో ఒకరు గౌతమ్ రెడ్డి. ఆయన నేపథ్యం పెద్దదే కానీ. మంత్రిగా పనిచేసి మెప్పింగల సామర్ధ్యం గౌతమ్ రెడ్డికి ఎంతవరకూ ఉందన్నది త్వరలోనే తేలనుంది. ఆంధ్రప్రదేశ్ గతిని మార్చే పరిశ్రమల శాఖను సీనియర్లకు ఇస్తారేమో అని భావించారు. కానీ జగన్ మాత్రం తనకు నమ్మకస్తుడైన గౌతమ్ రెడ్డికి ఇచ్చారు.

కొంతలో కొంత నయం అనిపించింది ఏంటంటే.. ఎంతో అనుభవం ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్  రెడ్డికి ఆర్థికశాఖ, శాసనభ వ్యవహరాలు శాఖ కట్టబెట్టడం. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకలు, నిధుల కేటాయింపు అంశాలను బుగ్గన బయటపెట్టవచ్చు. ఆర్థిక వ్యవహారాలపై ఆయన తనదైన ముద్ర వేయవచ్చు. కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గం నుంచి 2014లో వైసీపీ అభ్యర్థిగా తొలిసారిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై గెలుపొందారు అనంతరం పీఏసీ ఛైర్మన్‌గా పదవిని సొంతం చేసుకున్నారు.

అసెంబ్లీ బయట, లోపల ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, దుబారా వ్యయంపై నిలదీశారు. రెండోసారి 2019లో టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆయన పట్టు మంత్రిత్వశాఖకు ఉపయోగపడవచ్చునని భావిస్తున్నారు.

ఆదినుంచి తన కుటుంబానికి ఎంతో పెద్ద దిక్కుగా భావించే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు శాఖ అప్పగించడం సబబుగానే ఉంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రెవిన్యూశాఖలో మార్పులకు శ్రీకారం చుట్టవచ్చు.  ఈసారి ఎన్నికల్లో గోదావరి జిల్లాలు వైసీపీకి పట్టం కట్టాయి. దీంతో ఈ జిల్లాలను అక్కున చేర్చుకున్నారు జగన్.

రెండు గోదావరి జిల్లాల నుంచి ఆరుగురికి అవకాశం ఇచ్చారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపె విశ్వరూప్, కురసాల కన్నబాబు, తానేటి వనిత, ఆళ్ళనాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజులకు మంత్రులుగా అవకాశం కల్పించారు. అయితే గత ప్రభుత్వాల్లోని దేవాదాయ శాఖను క్షత్రియ సామాజిక వర్గానికి కేటాయించేవారు.

Image may contain: 2 people

ఈసారి శ్రీరంగనాథరాజుకి దేవాదాయ శాఖ ఇస్తారని భావించారు. కానీ గృహనిర్మాణశాఖను కట్టబెట్టారు. గతంలో జిల్లాకు చెందిన క్షత్రియ ఎమ్మెల్యేలకు దేవాదాయ శాఖ మంత్రి పదవులు ఇచ్చేవారు. దండు శివరామరాజు వంటి వారు నిర్వర్తించారు. ఈసారి జగన్ క్షత్రియ వర్గానికి గృహనిర్మాణశాఖను ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle