ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం
13-06-201913-06-2019 13:29:20 IST
2019-06-13T07:59:20.027Z13-06-2019 2019-06-13T07:59:17.566Z - - 16-01-2021

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించి బుధవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సభాపతి ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. సభాపతి పదవికి తమ్మినేని ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినందున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. అనంతరం తమ్మినేని సీతారాం బాధ్యతలు స్వీకరించారు. స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా సభలో సీఎం మాట్లాడుతూ.. ‘‘ సౌమ్యూడైన తమ్మినేని శాసనసభకు ఆరుసార్లు ఎన్నికై మంచిపేరు తెచ్చుకున్నారు. చట్టసభలపై మళ్లీ నమ్మకం కలిగించాలనే సీతారామ్‌ను ఎంచుకున్నాం. వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆలోచించి స్పీకర్ ఎంపికపై నిర్ణయం తీసుకున్నాం’’అని జగన్ అన్నారు. అనంతరం విపక్షనేత చంద్రబాబునాయుడు స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘విభజన తర్వాత ఏపీకి రెండో సభాపతిగా సీతారాం ఎన్నిక కావడం చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు అభినందనలు. తమ్మినేనికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ పిలుపునందుకుకుని విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా నలుగురు స్పీకర్లను అందించింది.’’ అని చంద్రబాబు అన్నారు. ఇదిలా ఉంటే.. స్పీకర్ ను ఆయన స్థానంలో కూర్చోబెట్టే సమయంలో సీఎం జగన్ అక్కడికి వెళ్ళగా, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు మాత్రం సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని అంటున్నారు. చంద్రబాబు తాను వెళ్ళకుండా టీడీపీ ఎమ్మెల్యేను పంపించడం విమర్శలకు గురవుతోంది. గత స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎన్నిక సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఈ ఆనవాయితీని పాటించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కోడెలను స్పీకర్ స్థానంలో వైఎస్ జగన్ కూర్చోబెట్టారు. తాజాగా చంద్రబాబు మాత్రం తాను వెళ్లకుండా.. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుని పంపించారు.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!
3 hours ago

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం
4 hours ago

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?
4 hours ago

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
9 hours ago

వరస్ట్ సీఎంలలో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే
11 hours ago

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా
12 hours ago

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?
13 hours ago

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్
14 hours ago

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?
15 hours ago

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?
15 hours ago
ఇంకా