newssting
BITING NEWS :
* కరోనా నెగిటివ్ రిపోర్టుతో వ‌చ్చిన‌వారికి మాత్ర‌మే గోవాలోకి అనుమ‌తి *భ‌ద్రాద్రి: నేటి నుంచి మూడు రోజుల పాటు దేశ‌వ్యాప్త బొగ్గుగ‌నుల స‌మ్మె*ఏపీ: క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా ఆన్‌లైన్‌లోనే హైకోర్టులో కేసుల విచార‌ణ‌.. నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వ‌ర‌కు వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా కేసుల విచార‌ణ*తూర్పుగోదావరి జిల్లా : కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో నేటి నుండి జిల్లాలో ఆర్టీసీ బస్సు సర్వీసులు తగ్గింపు *ఛత్తీస్ గడ్: రాజానందగావ్ జిల్లాలో భద్రతాదళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు. చూరియా సర్కిల్ పరిధి కటెంగా అటవీప్రాంతంలో జిల్లా పోలీసులు, డిఆర్జీ, ఐటిబిపి సిబ్బంది, మావోయిస్టుల ఏరివేతకు కూబింగ్... కాల్పులు. ప్లాటూన్ 1 డివిసి కమాండర్ డేవిడ్ అలియాస్ ఉమేష్ అనే మావోయిస్టు మృతి *ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ప్రియాంక గాంధీకి కేంద్రం నోటీసు. ఆగష్టు 1 లోపు ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశం*తెలంగాణలో ఈరోజు 1018 కరోనా కేసులు. కరోనాతో ఇవాళ ఏడుగురు మృతి. ఇవాళ ఒక్క హైదరాబాద్ లోనే 881 పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణలో మొత్తం 17,357 కరోనా కేసులు నమోదు *గుంటూరు జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్. అచ్చెన్నాయుడు కోలుకున్నారని వైద్యుల రిపోర్ట్. అచ్చెన్నాయుడిని విజయవాడ సబ్ జైలుకు తరలింపు*తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం. పలువురు అధికారులకు సోకిన కరోనా. మిగతా ఉద్యోగులకు టెస్టులు చేయించిన అధికారులు. 18 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ *పిల్లి సుభాష్, మోపిదేవి ఎమ్మెల్సీ పదవుల రాజీనామాలు ఆమోదం. నోటిఫికేషన్ జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో రెండు స్థానాలు ఖాళీ*సింగరేణి సీఎండీపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కేసు నమోదు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో రూ. 200 కోట్ల డీజిల్ కుంభకోణంపై విచారణ

ఏపీలో ఇసుక దుమారం.. జగన్ సర్కార్‌పై టీడీపీ నేతల ఆగ్రహం

30-08-201930-08-2019 13:08:44 IST
Updated On 30-08-2019 13:11:33 ISTUpdated On 30-08-20192019-08-30T07:38:44.752Z30-08-2019 2019-08-30T07:38:42.819Z - 2019-08-30T07:41:33.312Z - 30-08-2019

ఏపీలో ఇసుక దుమారం.. జగన్ సర్కార్‌పై టీడీపీ నేతల ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని టీడీపీ మండిపడుతోంది. ఇసుక దొరక్క నానా అవస్థలు పడుతున్నారని టీడీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇసుకాసురా...జగన్ మోహనా..పేదల పాలిట భస్మాసురా’ అంటూ రాసిన ప్లకార్డును టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రదర్శించారు. 

Image

ఇసుక సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మంగళగిరిలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. .వైసీపీ నేతలు ఇసుక అక్రమాలతో కోట్లు మెక్కుతున్నారని ఆరోపించారు.

ప్రజలకు సాధారణరీతిలో దొరకవలసిన ఇసుకను అందకుండా చేసి, భవన నిర్మాణ రంగానికి, తద్వారా లక్షలాది కార్మికులకు నష్టం కలిగించిన అనాలోచిత చర్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు. చేతులతో ఎత్తుకుని మరీ గృహనిర్భంధం చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. 

గొల్లపూడిలో మీడియా సమావేశంలో దేవినేని ఉమా ప్రభుత్వం తీరుని ఎండగట్టారు. 70రోజుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న పలు వైఫల్యాల కారణంగా ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, ఏ రంగం వారికి కూడా ఉపాధి అవకాశాలు లేక జీవితం దుర్భరంగా మారిందని ఆయన తెలియజేసారు. ఉమా అరెస్ట్ సందర్భంగా పలు ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు గొల్లపూడి వచ్చి దేవినేని ఉమాకు అండగా నిలిచారు.
Image

తమ పార్టీ చేపట్టిన ఈ ఆందోళనను ఉధృతం చేస్తామంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రకటించడంతో.... అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ ఆందోళన కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా చింతమనేని గృహనిర్భందం చేశారు.

పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నివాసంవద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇసుక ఇబ్బందులపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకు పిలుపు ఇచ్చినే నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగానే శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు నిమ్మల నివాసం వద్ద మోహరించారు.

జగన్ ప్రభుత్వం వచ్చాక 32 రకాల పనులు చేసే 20లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని. ఉచిత ఇసుక విధానంతో చంద్రబాబు ట్రాక్టర్ ఇసుక రూ.600లకు ఇస్తే... జగన్ ప్రభుత్వం అదే ట్రాక్టర్ ఇసుకు రూ.6800లు చేయటం శోచనీయం అన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా దేశం నాయకుల అరెస్ట్ లను నేతలు ఖండించారు. టీడీపీ శ్రేణులు అందర్నీ హౌస్ అరెస్టుచేసి కేవలం పాలకొల్లు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి బయటకు తీసుకు వెళ్లడం చర్చనీయాంశం అయింది. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారుతోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle