newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

ఎమ్మార్వో కారు ఆపిన ఘటన.. 426మందిపై కేసులు

20-02-202020-02-2020 13:12:23 IST
2020-02-20T07:42:23.167Z20-02-2020 2020-02-20T07:42:18.514Z - - 06-07-2020

ఎమ్మార్వో కారు ఆపిన ఘటన.. 426మందిపై కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి ఆందోళనల్లో భాగంగా మహిళారైతులు, స్థానికులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. కృష్ణాయపాలెంలో ఎమ్మార్వో కారు ఆపిన ఘటన సంచలనం కలిగించింది. దీనికి సంబంధించి 426 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిపై మంగళగిరి పోలీసు స్టేషన్‌లో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ మందడంలో రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నాకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా కేసులు పెట్టి వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

రాజధాని నిర్మాణానికి రైతులిచ్చిన భూములను పేదలకు నివేశన స్థలాలుగా ఇచ్చేందుకు వాటిని సర్వే చేయడానికి బుధవారం కృష్ణాయపాలెంకు వచ్చిన తహసీల్దార్లను, రెవెన్యూ సిబ్బందిని అమరావతి ప్రాంత రైతులు అడ్డగించిన సంగతి తెలిసిందే. ఎమ్మార్వోను ఘోరావ్ చేశారు. వారు కదలకుండా నాలుగు గంటలపాటు కారుముందు రాస్తారోకో చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

దుగ్గిరాల, పెదకాకాని మండల తహసీల్దార్లు మల్లేశ్వరి, రమేశ్‌నాయుడు, సర్వేయర్లు శ్రీనివాసరావు, విజయ్‌కుమార్‌‌లను రైతులు దిగ్బంధించారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు కేసులు పెట్టారు. 

అయితే రైతులు వెనక్కి తగ్గడం లేదు. రోడ్డుపై వాహనాలను అడ్డుకుంటూ, వాహనాలు శుభ్రం చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మందడం ప్రధాన రహదారిపై ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle