newssting
BITING NEWS :
*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

ఈ విపత్కర పరిస్థితిల్లో అన్నా క్యాంటీన్లు ఉండి ఉంటే?

29-03-202029-03-2020 09:31:19 IST
2020-03-29T04:01:19.109Z29-03-2020 2020-03-29T04:01:16.743Z - - 04-06-2020

ఈ విపత్కర పరిస్థితిల్లో అన్నా క్యాంటీన్లు ఉండి ఉంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అటు ప్రభుత్వంలోని అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రజలను ఇళ్లకే పరిమితం చేసి వైరస్ వ్యాప్తిపై యుద్ధమే చేస్తున్నారు. గత ఆదివారం జనతా కర్ఫ్యూతో మొదలైన ఈ కట్టడి చర్యలలో భాగంగా ప్రస్తుతం ఏపీలో కూడా లాక్ డౌన్ కఠినంగా అమలవుతుంది.

లాక్ డౌన్ నేపథ్యంలో రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో రిక్షా వాలాలు, తోపుడు బండ్ల వ్యాపారులు, పర్యాటక స్థలాలు, గుళ్ళు, గోపురాల ముందు పూజాసామాగ్రి అమ్ముకొనే వారు ఇలా ఎందరికో ఉపాధి లేకుండా పోయింది. వీరిదంతా ఏరోజు ఆరోజు సంపాదన, కుటుంబ పోషణపై ఆధారపడివుంటుంది. లాక్ డౌన్ నేపథ్యంలో వీరి బ్రతుకులు చితికిపోయాయి.

ఏపీ ప్రభుత్వం కంట తుడుపుగా రేషన్ బియ్యం, వెయ్యి రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పినా ఇప్పటికి ఇంకా మోక్షం కలగలేదు. పైగా ఈ పరిస్థితిలో ఈ వెయ్యి రూపాయలతో కుటుంబ పోషణ కూడా భారమే అవుతుంది. ఇలాంటి పరిస్థితిలోనే చంద్రబాబు ప్రభుత్వంలో మొదలుపెట్టిన అన్నా క్యాంటీన్లే ఇప్పుడు ఉండిఉంటే పేదలకు, కూలీలకు, అనాధలకు చాలా ఆసరాగా ఉండేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

పొరుగున తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మొబైల్ అన్నపూర్ణ పథకంలో భాగంగా మరికొన్ని సెంటర్లను తెరిచింది. ముఖ్యంగా హైదరాబాద్లో కూలీలు, విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ సెంటర్లను ఏర్పాటు చేశారు. కానీ ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లు ఉండగా ప్రస్తుత ప్రభుత్వం అసలు ఆ వ్యవస్థనే పూర్తిగా తీసేసింది.

గత టీడీపీ ప్రభుత్వంలో పక్కా భవనాలలో ఎక్కడా వెనుకాడకుండా కేవలం 5 రూకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం-రాత్రికి భోజనం అందించేందుకు ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక గత ప్రభుత్వ గుర్తులను చెరిపేసి క్రమంలో ఆ అన్నా క్యాంటీన్లను తొలగించేశారు. దీనిపై అప్పుడే విమర్శలు వచ్చాయి.

ప్రజలకు మంచి జరిగే పథకంలో పార్టీలు, రాజకీయాలు చూస్తే అది ప్రభుత్వానికి, ప్రజలకు మంచిది కాదని అప్పుడే పెద్దలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కావాలంటే పేరు మార్చుకొని అయినా పథకాన్ని కొనసాగించాలని నెత్తి, నోరు బాదుకుని మరీ చెప్పారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఏకపక్షంగా వ్యవహరించి పథకాన్ని నామరూపాల్లేకుండా చేశారు.

ఆ మధ్య ఇసుక కొరత సమయంలో కూడా అన్నా క్యాంటీన్లు ఉంటే కూలీల ఆకలి తీరేది అనే అభిప్రాయం వినిపించగా నేడు లాక్ డౌన్ నేపథ్యంలో క్యాంటీన్లు ఉంటే పేదలకు పస్తులు తప్పేదని అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇస్తామన్న వెయ్యి రూపాయలకు మరో 350రూ కలిపితే మూడు పూటలా ఈ క్యాంటీన్లలో ఆహారం లభించేది. ఈ పరిస్థితిలో ఈ క్యాంటీన్లలో మూడు పూటలా ఆహరం అందించి ఉంటే ప్రజలు పాలకులను దేవుళ్ళుగా కొలిచేవారు. కానీ ఆ అవకాశాన్ని.. ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాన్ని జగన్ మోహన్ రెడ్డి సర్కార్ చేజేతులా తుంచేసింది.

మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!

మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!

   14 minutes ago


హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

   an hour ago


మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

   3 hours ago


ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

   5 hours ago


ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

   5 hours ago


కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

   5 hours ago


ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

   6 hours ago


పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

   7 hours ago


కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

   7 hours ago


కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

   19 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle