newssting
BITING NEWS :
* కరోనా నెగిటివ్ రిపోర్టుతో వ‌చ్చిన‌వారికి మాత్ర‌మే గోవాలోకి అనుమ‌తి *భ‌ద్రాద్రి: నేటి నుంచి మూడు రోజుల పాటు దేశ‌వ్యాప్త బొగ్గుగ‌నుల స‌మ్మె*ఏపీ: క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా ఆన్‌లైన్‌లోనే హైకోర్టులో కేసుల విచార‌ణ‌.. నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వ‌ర‌కు వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా కేసుల విచార‌ణ*తూర్పుగోదావరి జిల్లా : కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో నేటి నుండి జిల్లాలో ఆర్టీసీ బస్సు సర్వీసులు తగ్గింపు *ఛత్తీస్ గడ్: రాజానందగావ్ జిల్లాలో భద్రతాదళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు. చూరియా సర్కిల్ పరిధి కటెంగా అటవీప్రాంతంలో జిల్లా పోలీసులు, డిఆర్జీ, ఐటిబిపి సిబ్బంది, మావోయిస్టుల ఏరివేతకు కూబింగ్... కాల్పులు. ప్లాటూన్ 1 డివిసి కమాండర్ డేవిడ్ అలియాస్ ఉమేష్ అనే మావోయిస్టు మృతి *ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ప్రియాంక గాంధీకి కేంద్రం నోటీసు. ఆగష్టు 1 లోపు ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశం*తెలంగాణలో ఈరోజు 1018 కరోనా కేసులు. కరోనాతో ఇవాళ ఏడుగురు మృతి. ఇవాళ ఒక్క హైదరాబాద్ లోనే 881 పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణలో మొత్తం 17,357 కరోనా కేసులు నమోదు *గుంటూరు జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్. అచ్చెన్నాయుడు కోలుకున్నారని వైద్యుల రిపోర్ట్. అచ్చెన్నాయుడిని విజయవాడ సబ్ జైలుకు తరలింపు*తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం. పలువురు అధికారులకు సోకిన కరోనా. మిగతా ఉద్యోగులకు టెస్టులు చేయించిన అధికారులు. 18 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ *పిల్లి సుభాష్, మోపిదేవి ఎమ్మెల్సీ పదవుల రాజీనామాలు ఆమోదం. నోటిఫికేషన్ జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో రెండు స్థానాలు ఖాళీ*సింగరేణి సీఎండీపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కేసు నమోదు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో రూ. 200 కోట్ల డీజిల్ కుంభకోణంపై విచారణ

ఈ ఫోన్ల గొడవేంటి బాబూ?

26-11-201826-11-2018 13:32:24 IST
Updated On 26-11-2018 13:32:21 ISTUpdated On 26-11-20182018-11-26T08:02:24.150Z26-11-2018 2018-11-26T08:02:21.995Z - 2018-11-26T08:02:21.997Z - 26-11-2018

ఈ ఫోన్ల గొడవేంటి బాబూ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అందరికంటే ముందుంటారు. తాజాగా ఆయన చేపట్టిన ఐవీఆర్‌ఎస్‌ సర్వే టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై ఏపీ సీఎం రంగంలోకి దిగి ఫోన్లద్వారా వారి ప్రోగ్రెస్ రిపోర్టు తెలుసుకుంటున్నారు. ‘నమస్కారం... నేను మీ చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నాను... మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?, మీరు తృప్తి చెందుతున్నారా? సంక్షేమ కార్యక్రమాల్లో అందరినీ కలుపుకొని వెళుతున్నారా? మీకు అందుబాటులో ఉంటున్నారా? అవినీతి రహిత పాలన అందిస్తున్నారా?’ అంటూ ప్రశ్నల పరంపరతో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్లు హోరెత్తుతున్నాయి. త్వరలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నేతలు సిద్ధమవుతున్న తరుణంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఈ అభిప్రాయాలను క్రోడీకరించడం ద్వారా వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎవరి అభ్యర్థిత్వాల వైపు మొగ్గుచూపాలనేది నిర్ధారిస్తారు.  ఇప్పటికే కొన్ని బృందాలు నియోజకవర్గాల్లో ఎంపికచేసిన ప్రాంతాల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజాసంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంలో నిమగ్నమయ్యారు. 

83339 99999 నెంబర్ నుంచి ఈ ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తిగా ఉంటే మీ ఫోన్‌లో 1 నెంబరు నొక్కండి.... అసంతృప్తిగా ఉన్నట్లయితే 2 నొక్కండి అంటూ వివిధ ప్రశ్నలకు ప్రజల నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన వారికి ఫోన్ చేసి మీకు ఫోన్ వస్తే తమకు అనుకూలంగా సమాచారం ఇవ్వాలంటూ కోరుతుండడం గమనార్హం! మొత్తం మీద ఎమ్మెల్యేల పనితీరుపై అధినేత చంద్రబాబు చేస్తున్న సర్వేలు రానున్న ఎన్నికల్లో వారి అభ్యర్థిత్వాలపై ప్రభావం చూపుతాయంటున్నారు. 2019 ఎన్నికలలో మళ్లీ గెలుపు సాధించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఐవీఆర్‌ఎస్‌ సర్వేతో కొంతమంది ఎమ్మెల్యేలు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా గ్రామదర్శిని, జన్మభూమి, సభ్యత్వ నమోదు, సంక్షేమ పథకాల అమలులో చురుగ్గా వ్యవహరించని ఎమ్మెల్యే లు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. 2-3 నెలల్లో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే తరుణంలో నేరుగా టీడీపీ క్రియాశీలక కార్యకర్తలతో అధినేత చంద్రబాబునాయుడు నేరుగా రంగంలోకి దిగడంతో నేతలు టెన్షన్ పడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్లు ఇప్పుడున్న జూనియర్లతో సర్దుకోలేక పోతున్నారు. సీనియర్‌, జూనియర్లను ఎమ్మెల్యేలు సమన్వయం చేయడంలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలపై ఐవీఆర్‌ఎస్‌లో వ్యతిరేకంగా సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఏ విధమైన పరిణామాలకు దారి తీస్తుందోనని పలువురు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ ఫోన్ల గొడవేంట్రా బాబూ అంటూ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle