newssting
BITING NEWS :
*అఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఘోర బాంబు పేలుడు..63 మంది మృతి *నేడు హైదరాబాద్‌లో జేపీ నడ్డా పర్యటన*డల్లాస్‌ లో ప్రవాసాంధ్రులతో ఏపీ సీఎం జగన్‌ సభ *హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సులేట్‌ ఆధ్వర్యంలో 10కే రన్‌ * ఫిల్మ్‌నగర్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు… 24 వాహనాలు సీజ్‌*అవినీతిలేని ఆంధ్రప్రదేశ్‌ నిర్మించాలన్నదే నా కల : ఏపీ సీఎం జగన్‌

ఇప్పుడు బాబు ఏంచేస్తారు?

30-11-201830-11-2018 16:01:11 IST
Updated On 30-11-2018 16:01:08 ISTUpdated On 30-11-20182018-11-30T10:31:11.408Z30-11-2018 2018-11-30T10:31:08.275Z - 2018-11-30T10:31:08.277Z - 30-11-2018

ఇప్పుడు బాబు ఏంచేస్తారు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రదర్యాప్తు సంస్థల్ని మోడీ ప్రభుత్వం నీరుగారుస్తోందని, వాటి విశ్వసనీయతని దెబ్బతీస్తోందని అమరావతి నుంచి హస్తిన వరకూ వెళ్ళి మరీ సీఎం చంద్రబాబు అరిచి గీపెడుతున్నారు. సీబీఐని ఏపీలోకి ఎంటర్ కానివ్వనని భీషణ ప్రతిన బూనారు. అయితే అప్పుడెప్పుడో తెరమరుగైందని అనుకున్న ఒకకేసులో సీబీఐ కాలరేగరేసి మరీ ఏపీలో ఎంటరై చంద్రబాబు ముందే తొడకొట్టబోతోంది. విజయవాడలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో ఏపీలో సీబీఐ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టే అంటున్నారు. కోర్టు ఆదేశాలతో సీబీఐ ఈ కేసు విచారించబోతుంది. ఈ కేసులో రికార్డులను ధ్వంసం చేసిన విజయవాడ కోర్టు సిబ్బంది పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ కోర్టు సిబ్బందిపైనా కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ ఏపీలోకి అడుగుపెట్టబోతోంది. 2007 డిసెంబర్‌ 27న ఫార్మసీ విద్యార్థిని అయిన ఆయేషా మీరా విజయవాడలోని ఒక హాస్టల్‌లో హత్యకు గురైంది. బాత్‌రూంలో ఆమె రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం పక్కన ఓ లేఖ ఉంది. తన ప్రేమను తిరస్కరించడంతోనే ఆయేషాను అత్యాచారం చేసినట్టు లేఖ ఉంది.

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా జగ్గయ్యపేట మండలం ఆనాసాగరానికి చెందిన సత్యంబాబును గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. 2010 సెప్టెంబర్‌లో విజయవాడ మహిళా కోర్టు ఆయేషా మీరాను రేప్‌ చేసినందుకు నిందితుడు సత్యంబాబుకు పదేళ్లు, ఆమెను హత్య చేసినందుకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే 2016లో హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. ఆయేషా మీరా కేసు ఆధారాలను తప్పుదోవ పట్టించారంటూ ఆమె తల్లి హైకోర్టుని ఆశ్రయించడంతో ఆ కేసు మళ్లీ సీబీఐ చేతికొచ్చింది. ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవడంతో హైకోర్టు సీబీఐ విచారణకు తాజాగా ఆదేశించడంతో సీబీఐ ఎంట్రీ అనివార్యం కాబోతోంది. ఏపీలో అడుగుపెట్టాలంటే సీబీఐ అధికారులు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకునేలా ఈమధ్య చంద్రబాబు ప్రభుత్వం సంచలన ఉత్తర్వు జారీచేసింది.  అందువల్ల ఇకపై ఏపీ ప్రభుత్వం తనంతట తానుగా కోరిన కేసుల్లో మాత్రమే సీబీఐ దర్యాప్తు జరపగలదు. లేదా కోర్టు ఆదేశాలతో మాత్రమే ఏపీలో అడుగు పెట్టగలదని జీవోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయేషా మీరా కేసులో సీబీఐ ఎంట్రీకి కోర్టు పర్మిషన్ ఇచ్చినట్టయింది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle