newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

అప్పుడ‌లా.. ఇప్పుడిలా..! విడ‌ద‌ల ర‌జినీ ఇంత‌లా మారిపోయారా..?

04-07-202004-07-2020 08:23:01 IST
Updated On 04-07-2020 10:44:05 ISTUpdated On 04-07-20202020-07-04T02:53:01.441Z04-07-2020 2020-07-04T02:52:50.892Z - 2020-07-04T05:14:05.065Z - 04-07-2020

అప్పుడ‌లా.. ఇప్పుడిలా..! విడ‌ద‌ల ర‌జినీ ఇంత‌లా మారిపోయారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఇప్పుడు చిలుక‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల రజినీ హాట్ టాపిక్‌గా మారిపోయారు. అతి త‌క్కువ కాలంలో రాజ‌కీయాల్లో ఎక్కువ‌గా రాణిస్తున్న నేత‌ల్లో ఆమె ఒక‌రు. ఎన్ఆర్ఐ అయిన ఆమె ఎన్నిక‌ల‌కు ముందే రాజ‌కీయాల్లో ప్ర‌వేశించి ప‌క్కా ప్లాన్‌తో ఎమ్మెల్యేగా గెల‌వ‌గ‌లిగారు. చిలక‌లూరిపేట‌లో అప్ప‌టికే వైసీపీ విధేయుడైన నేత‌ను కాద‌ని టిక్కెట్ పొందిన ఆమె బ‌ల‌మైన టీడీపీ అభ్య‌ర్థి ప్ర‌త్తిపాటి పుల్లారావును ఓడించగ‌లిగారంటే విడ‌ద‌ల ర‌జినీ రాజ‌కీయంగా త‌క్కువ కాలంలోనే ఎంత ఆరితేరారో అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే, కీల‌క స్థానంలో అనూహ్య విజ‌యం సాధించి పార్టీకి క‌లిసి వ‌చ్చిన ఆమె ఇప్పుడు వ‌రుస వివాదాల‌తో పార్టీకి న‌ష్టం చేస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లుతో ఆమెకు ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. దీంతో చిలుక‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే వ‌ర్గాలుగా చీలిపోయింది. ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌లు తార‌స్థాయికి చేరాయి. గ‌తంలో కోట‌ప్ప‌కొండ జాత‌ర స‌మ‌యంలోనే రెండువ‌ర్గాల మ‌ధ్య కొట్లాట జ‌ర‌గ‌గా తాజాగా ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు కారుపై ఎమ్మెల్యే వ‌ర్గీయులు దాడికి పాల్ప‌డ్డారు.

అయితే, విడ‌ద‌ల ర‌జినీ గ‌తంలో ఒక‌లా, ఇప్పుడు మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. నిజానికి విదేశాల నుంచి వ‌చ్చిన త‌ర్వాత ర‌జినీ తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లారు. అప్ప‌టికే చిలుక‌లూరిపేట ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేని నేత‌గా ఉన్న ప్ర‌త్తిపాటి పుల్లారావు ద్వారా తెలుగుదేశం పార్టీలో చేరారు. క‌చ్చితంగా ఎమ్మెల్యే కావాల‌నే సంక‌ల్పంతో రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన ర‌జినీ త‌న ల‌క్ష్యం నెర‌వేర‌డానికి ప‌క్కా రాజ‌కీయ నాయ‌కురాలిగా మారిపోయారు. ట్ర‌స్ట్ ఏర్పాటుచేసి నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. ప్ర‌త్తిపాటి మంత్రిగా ఉన్న‌ప్పుడే నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె పేరు మారుమ్రోగిపోయేలా చేసుకున్నారు.

త‌ర్వాత నేరుగా టీడీపీ పెద్ద‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి చిలుక‌లూరిపేట టిక్కెట్ ఇవ్వ‌మ‌ని అడిగారు. నిన్న కాక మొన్న వ‌చ్చిన ఆమె ఏకంగా ప్ర‌త్తిపాటి టిక్కెట్‌కే ఎస‌రు పెట్ట‌డంతో టీడీపీ పెద్ద‌ల‌తో పాటు ప్ర‌త్తిపాటి కూడా షాక్ తిన్నారు. అయితే, టీడీపీలో టిక్కెట్ హామీ దొర‌క‌క‌పోవ‌డంతో ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూశారు. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు సుమారు ఆరు నెల‌ల స‌మ‌యం ఉంద‌న‌గా జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వెళ్లి ఆ పార్టీలో చేరి వ‌చ్చారు. అప్ప‌టికే ఆమె వైసీపీ నుంచి టిక్కెట్ హామీ పొందారు. దీంతో పార్టీలో చేర‌గానే ఆమెకు నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జి ప‌ద‌విని వైసీపీ క‌ట్ట‌బెట్టింది.

విడ‌ద‌ల ర‌జినీ వైసీపీలో చేర‌డంతో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది అప్ప‌టివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీగా ఉన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌. ఆయ‌న దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వ‌ర్గీయుడిగా కాంగ్రెస్‌లో కొన‌సాగారు. వైఎస్ జ‌గ‌న్‌కు, వైసీపీకి విధేయుడు. తొమ్మిదేళ్ల పాటు చిలుక‌లూరిపేట వైసీపీకి పెద్ద దిక్కుగా వ్య‌వ‌హ‌రించారు. 2014లో ప్ర‌త్తిపాటి పుల్లారావు చేతిలో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు.

నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప్ర‌త్యేకంగా వ‌ర్గం ఉంది. ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు వ‌ర‌కు వైసీపీ టిక్కెట్ ఆయ‌న‌కే ద‌క్కుతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, విడ‌ద‌ల ర‌జినీ ఆయ‌న ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లారు. మ‌ర్రి కంటే ర‌జినీ అయితే ఆర్థికంగా బ‌లంగా ఉన్న ప్ర‌త్తిపాటి పుల్లారావును ఎదుర్కోగ‌ల‌ర‌ని విడ‌ద‌ల ర‌జినీకి వైసీపీ టిక్కెట్ ఇచ్చింది.

అప్పుడు ర‌జినీ పాత వైసీపీ వారిని క‌లుపుకుపోయారు. పార్టీలో చేర‌గానే అసంతృప్తితో ఉన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయ‌న‌ను త‌న తండ్రి లాంటి వార‌ని చెప్పారు. తాను గెలిచినా రాజ‌శేఖ‌ర్ చెప్పిన‌ట్లే అంతా జ‌రుగుతుంద‌ని చెప్పారు. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ మంత్రి అవుతార‌ని అన్నారు. ఇలా ర‌జినీ త‌మ వ‌ద్దకు రావ‌డం, క‌లిసి ప‌ని చేస్తాన‌ని చెప్ప‌డంతో ఎన్నిక‌ల్లో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, ఆయ‌న వ‌ర్గీయులు ర‌జినీ విజ‌యం కోసం బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. జ‌గ‌న్ కూడా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తాన‌ని బ‌హిరంగంగా హామీ ఇచ్చారు.

కానీ, ఎన్నిక‌ల త‌ర్వాత సీన్ మారింది. ఎమ్మెల్యేగా హ‌వా అంతా విడ‌ద‌ల ర‌జినీదే న‌డుస్తోంది. ఆమెకు ప్ర‌త్యేక వ‌ర్గం ఏర్ప‌డింది. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వ‌ర్గీయుల పెత్త‌నం న‌డ‌వ‌డం లేదు. దీంతో వారు న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ఎంపీ కూడా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వ‌ర్గీయుల‌కు బాగా ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఇది విడ‌ద‌ల ర‌జినీ వ‌ర్గీయుల‌కు న‌చ్చ‌డం లేదు.

నిజానికి పైకి ర‌జినీ ఏమీ మాట్లాడ‌క‌పోయినా ఆమె వ‌ర్గీయులు ఎంపీని ప‌దేప‌దే అడ్డుకుంటున్నారు. ఫ్లెక్సీలు చింపుకోవ‌డం, దాడులు చేసుకోవ‌డం కామ‌న్‌గా మారిపోయింది. ఈ క్ర‌మంలోనే రెండు రోజుల క్రితం ఆమెకు స‌మాచారం లేకుండా నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చార‌ని ఎంపీ కారుపై విడ‌ద‌ల వ‌ర్గీయులు దాడి చేశారు. ఇలా చిలుక‌లూరిపేట వైసీపీ వ‌ర్గ‌పోరుతో స‌త‌మ‌త‌మ‌వుతోంది. ముఖ్యంగా విడ‌ద‌ల ర‌జినీ గెల‌వ‌క‌ముందు ఒక‌లా ఉండి గెలిచిన త‌ర్వాత పూర్తిగా మారిపోయార‌ని మ‌ర్రి వ‌ర్గీయులు ఆరోపిస్తున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle