newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

అచ్చెన్నాయుడి డిశ్చార్జ్.. సబ్ జైలుకి తరలింపులో హైడ్రామా

02-07-202002-07-2020 09:29:04 IST
Updated On 02-07-2020 11:58:26 ISTUpdated On 02-07-20202020-07-02T03:59:04.155Z02-07-2020 2020-07-02T03:58:22.043Z - 2020-07-02T06:28:26.225Z - 02-07-2020

అచ్చెన్నాయుడి డిశ్చార్జ్.. సబ్ జైలుకి తరలింపులో హైడ్రామా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ మంత్రి, టీడీపీఎల్పీ ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడుని జైలుకి తరలించారు. ఆయనను జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేయడంతో హైడ్రామా చోటుచేసుకుంది. అచ్చెన్న ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని వైద్యుల కమిటీ తెలిపింది. అయితే కమిటీపై ఒత్తిడి పెంచి డీఎంఈ డిశ్చార్జ్ రాయించారు. మధ్యాహ్నం నుంచి జీజీహెచ్‌లోనే డీఎంఈ ఉండి  ఒత్తిడి చేయడంతో వైద్యులు తలొగ్గక తప్పలేదు.  డీఎంఇ సిఫారసుతో హుటాహుటిన జీజీహెచ్‌ నుంచి అచ్చెన్నాయుడును డిశ్చార్జ్‌ చేశారు. వెంటనే ఆయనను పోలీసులు విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. అచ్చెన్నాయుడును ఆస్పత్రి లోపలి నుంచి వీల్‌చైర్‌లో తీసుకొచ్చి అంబులెన్స్‌లో విజయవాడకు తీసుకెళ్లారు. టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపినా పోలీసులు పట్టించుకోలేదు. డీఎంఈ, పోలీసుల తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. తనకు కరోనా టెస్ట్ చేయాలని కోరారు. కొలనోస్కోపి పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదని, కరోనా పరీక్ష చేయకుండా జైలు అధికారులు అనుమతించరని పేర్కొన్నారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాతే డిశ్చార్జ్ చేయాలని లేఖలో అచ్చెన్న విజ్ఞప్తి చేశారు. అయితే  ఈలేఖను అంతగా పట్టించుకోలేదని టీడీపీ నేతలు అంటున్నారు. 

చంద్రబాబు, లోకేష్ ఆగ్రహం

ఆరోగ్యం కుదుటపడకపోయినా జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడును బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నను బలవంతంగా డిశ్చార్జ్‌ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమయం వేసి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.

సాయంత్రం 5 గంటల తర్వాత 4:20 సమయం వేసి డిశ్చార్జ్‌ చేశారని చంద్రబాబు అన్నారు. డిశ్చార్జ్ సందర్భంగా డాక్టర్లు కనీస నిబంధనలు పాటించలేదని,  కమిటీ పేరుతో డాక్టర్స్ డే రోజునే తప్పుడు నివేదిక ఇప్పించారని చంద్రబాబు అన్నారు. అచ్చెన్న ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన విమర్శించారు. అందువల్లే రెండోసారి ఆపరేషన్ అవసరమైందని ఆయన అన్నారు.కాగా కోర్టు ద్వారా అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ ని ఆపడానికి ప్రయత్నాలు జరిగాయి.కాని తీర్పు రాకపోవడంతో అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేసి జైలుకి తరలించాల్సి వచ్చింది. 

అచ్చెన్నాయుడుని బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జగన్ రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ఆపరేషన్ అయిన వ్యక్తిని 24 గంటలు రోడ్లపై తిప్పి రెండోసారి ఆపరేషన్‌కి కారణమయ్యారని మండిపడ్డారు. ఇప్పుడు గాయం మానక ముందే డాక్టర్లపై ఒత్తిడి చేసి డిశ్చార్జ్ చేశారని వ్యాఖ్యానించారు. చేస్తున్న ప్రతీ తప్పుకి జగన్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేష్ హెచ్చరించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle