హైదరాబాద్‌లో బాంబు పేలుడు.. కార్లు, బస్సుల అద్దాలు ధ్వంసం
21-08-202021-08-2020 12:46:28 IST
Updated On 21-08-2020 16:09:41 ISTUpdated On 21-08-20202020-08-21T07:16:28.252Z21-08-2020 2020-08-21T07:16:16.608Z - 2020-08-21T10:39:41.505Z - 21-08-2020

హైదరాబాద్‌లో బాచుపల్లిలో జరిపిన పేలుడు ధాటికి సమీప ప్రాంతాల ప్రజలంతా భయపడిపోయారు. ఓ గృహనిర్మాణ ఈ భారీ బ్లాస్టింగ్లను జరిపింది. బాచుపల్లి నుంచి గండిమైసమ్మ వెళ్లే రహదారిలో వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల, శ్రీచైతన్య బాలికల వసతిగృహం మధ్య ఉన్న స్థలంలో ఓ నిర్మాణ సంస్థ భారీ భవన నిర్మాణాన్ని ప్రారంభించింది. సెల్లార్ కోసం గుంతలు తవ్వుతుండగా అడ్డుగా ఉన్న రాళ్లను పగలగొట్టేందుకు బ్లాస్టింగ్ నిర్వహించింది.ఈ బ్లాస్టింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఆ సంస్థ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు అనుమతి రాలేదని తెలుస్తోంది. ఈ సంస్థ పేలుడు ప్రక్రియ చేపట్టడంతో రాళ్ల శకలాలు కిలోమీటరు దూరం వరకూ చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఆ సమయంలో అటుగా వస్తున్న కారు వెనుకవైపు ఓ బండరాయి పడింది. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణభయంతో దూరం జరిగిపోయారు.అంతేకాక, బండరాళ్లు సమీపంలోని దుకాణంపైన కూడా పడ్డాయి. రూ.1.50 లక్షల విలువైన సామగ్రి ధ్వంసమైనట్లు యజమాని చెప్పారు. పేలుడు ధాటికి శ్రీచైతన్య బాలికల వసతి గృహంలో నిలిపి ఉంచిన మూడు బస్సుల అద్దాలు, రెండు షెడ్ల పైకప్పులు, వసతి గృహం గోడలు, కిటికీలు పగిలిపోయాయి. వసతిగృహం ఇన్ఛార్జికి చెందిన కారు, ఓ ట్రాలీ ఆటోపైనా బండరాళ్లు పడ్డాయి.

రాయవరం మునుసుబు వుండవిల్లి సత్యనారాయణ మూర్తి
14-05-2022

సగం డైరీ వ్యవస్థాపకుడు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి
14-05-2022

ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు
12-05-2022

తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు
12-05-2022

AP PGECET 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
11-05-2022

ఈరోజు బంగారం, వెండి ధరలు
11-05-2022

మార్కెట్లో టాటా నెక్సాన్ EV మ్యాక్స్
11-05-2022

IIM-K : మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త కోర్సులు
11-05-2022

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ GDS రిక్రూట్మెంట్ 2022
10-05-2022

కర్ణాటక బ్యాంక్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2022
10-05-2022
ఇంకా