newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

షాకింగ్ కామెంట్.. ఏడాది చివరికి 75 కోట్ల మందికి కరోనా!

30-05-202030-05-2020 07:04:43 IST
2020-05-30T01:34:43.238Z30-05-2020 2020-05-30T01:34:41.693Z - - 06-07-2020

షాకింగ్ కామెంట్.. ఏడాది చివరికి 75 కోట్ల మందికి కరోనా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ ఏడాది చివరి నాటికి మన భారత దేశంలో సగం జనాభాకు కరోనా వైరస్ సోకుతుంది. ప్రస్తుతమున్న లెక్కల ప్రకారం మన దేశ జనాభా 130 అనుకుంటే అందులో సగం 75 కోట్ల మందికి డిసెంబర్ నాటికి కరోనా సోకుతుందని బెంగ‌ళూరు నిమ్హాన్ డాక్ట‌ర్ ర‌వి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అందుకు సూచనలు కూడా మే నెలలో కనిపిస్తున్నాయని కూడా అయన ఉదాహరణలతో సహా అంచనాలు వేశారు.

ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య ఏ మాత్రం ఆగడం లేదు. లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్న సమయంలో కాస్త అదుపులో ఉన్నట్లుగా కనిపించినా లాక్ డౌన్ సడలింపులతో ఇప్పుడు కేసుల సంఖ్య ప్రతిరాష్ట్రంలో వేలకు చేరుకుంది. పైగా రోజురోజుకి సంఖ్య పెరుగుతూనే ఉంది.  ఇప్పటికే మన దేశంలో లక్షా అరవై ఆరువేల మందికి కరోనా సోకింది. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.

వచ్చే రోజులలో ఈ సంఖ్య లక్షలలో చేరుతుందని చెప్పడానికి మే నెల రెండో వారం నుండి కరోనా కేసుల గ్రాఫ్ ఉదాహరణని అయన చెప్తున్నారు. అయితే 75 కోట్ల మందికి కరోనా సోకినా అందులో ఐదు నుండి పదిశాతం మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం అవుతుందని అయన చెప్పారు. కాగా సుమారు ముప్పై శాతం మందిలో అసలు వ్యాధి లక్షణాలు కూడా కనిపించవంటున్నారు.

కాగా అయన చెప్పినట్లుగా ఐదు శాతం మందికి ఆక్సిజన్ అందించడం అంటే సుమారుగా ఏడున్నర కోట్ల మందికి వెంటిలేటర్ అనమాట. ఇది ఒకవిధంగా మన ప్రభుత్వానికి సవాల్ అనే చెప్పుకోవాలి. అందుకు ఇప్పటి నుండే ప్రభుత్వాలు సమాయత్తమవాలని డాక్టర్ రవి హెచ్చరించారు. ఈ కరోనా వైర‌స్ ఎబోలా, సార్స్ క‌న్నా డేంజ‌ర్ ఏమీ కాద‌ని.. కాకపోతే ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోతే మాత్రం నష్టం తప్పదన్నారు.

ఏడాది చివరి నాటికి దేశంలోని ప్ర‌తి జిల్లాలో క‌నీసం రెండు క‌రోనా టెస్ట్ ల్యాబులైనా ఉండాల‌ని, రాబోయే ప‌రిస్థితిని హ్యాండిల్ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మెడిక‌ల్ ఎక్విప్మెంట్ తో సిద్ధంగా ఉండాల‌ని.. అప్పుడే మనం మహమ్మారిని ఎదుర్కోగలమని డాక్ట‌ర్ ర‌వి హెచ్చ‌రించారు. దేశంలో ప్రతి పౌరిడికి ఇది ఒక బాధ్యతతో మెలగాల్సిన సమయమని గుర్తు పెట్టుకోవాలని అయన కోరారు.

వచ్చే ఏడాది వరకు కరోనాకు వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదని.. కనుక ఈ ఏడాది ఎంతగా ప్రభలాలో అంతవరకు వెళ్తుందన్నారు. ముందుగా దేశ ప్రజలు భయాన్ని వీడి ప్రతి ఒక్కరు మరొకరితో కరోనాను ఎదుర్కోవడంలో సిద్ధంగా ఉండాలని.. అదే ముందు ప్రభుత్వాలు ప్రజలకు నేర్పించాలని అయన పేర్కొన్నారు. కాగా, దేశజనాభాలో సగం మందికి కరోనా సోకనుందని అయన వ్యాఖ్యలు ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి.

ఇప్పటికే మే రెండో వారం తర్వాత దేశంలో మళ్ళీ రెడ్ జోన్స్ పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్య పెరిగినా ప్రభుత్వాలు మాత్రం కఠినంగా ఉండే పరిస్థితి లేకుండా పోతుంది. ప్రజలే ఎవరికి వారు నియమ నిబంధనలతో మెలగాల్సిన అవసరం ఏర్పడింది. కనుక ఒక విధంగా అంకెలు ఖచ్చితంగా చెప్పలేకపోయినా ఏడాది చివరికి కరోనా విజృంభణ భీకరంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ మహమ్మారి నుండి ప్రజలను రక్షించే మార్గం వ్యాక్సిన్ ఒక్కటే. మరి అది వచ్చేది ఎప్పటికో?!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle