newssting
BITING NEWS :
*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

లాక్ డౌన్‌‌ని లైట్ తీసుకుంటున్న జనం

27-03-202027-03-2020 12:58:46 IST
2020-03-27T07:28:46.596Z27-03-2020 2020-03-27T07:27:20.442Z - - 04-06-2020

లాక్ డౌన్‌‌ని లైట్ తీసుకుంటున్న జనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది కరోనా మహమ్మారి.  కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించి అందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వాలు పటిష్టమయిన చర్యలు చేపట్టాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మాత్రం వినడం లేదు అక్రమ మార్గంలో సరిహద్దులు దాటి ప్రయాణించడానికి పలు మార్గాలు వెతుకుతున్నారు. అత్యవసర సేవలకు సంబందించిన అంబులెన్స్ లు గూడ్స్ వాహనాలు వెళ్ళడానికి అనుమతి ఉండటంతో కొందరు వాటి ద్వారా ఇతర మార్గాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసుల నిబంధనలను పట్టించుకోని వారిపై లాఠీలు ఝళిపిస్తున్నారు. 

మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన బోరాజ్ చెక్ పోస్ట్ వద్ద ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న  కంటెయినర్ లో ప్రయాణిస్తున్న 30 మంది యువకులను పోలీసులు పట్టుకొని వైద్య పరీక్షల కోసం తరలించారు. ఇటు కరోనా భయంతో మాస్క్ లు, శానిటైజర్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇదే అదనుగా షాపు యజమానులు వినియోగదారులకు అడ్డంగా ముంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి వారి ఆట కట్టిస్తున్నారు. హైదరాబాద్ సనత్ నగర్ పిఎస్ పరిధి లోని ఒక్కసారిగా ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు.

https://www.photojoiner.net/image/HxwHOe4a

భరత్ నగర్ లో లలిత మెడికల్ షాప్ లో హ్యాండ్ .శానిటైజెర్  మాస్క్ లు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు సమాచారం రావడంతో దాడులు నిర్వహించామని ఎస్వోటీ పోలీసులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకొని సనత్ నగర్ పోలీసులకు అప్పగించారు. సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఎక్కువ ధరలకు అమ్మే షాపులపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.ఇటు కూరగాయల ధరలు, నిత్యావసరాలను కూడా ఎక్కువ రేటుకి అమ్మేవారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle