newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

రేపే చంద్రగహణం.. ఏ గ్రహరాశులపై ప్రభావమో తెలుసా?

04-07-202004-07-2020 20:17:54 IST
Updated On 04-07-2020 20:27:59 ISTUpdated On 04-07-20202020-07-04T14:47:54.610Z04-07-2020 2020-07-04T14:47:51.301Z - 2020-07-04T14:57:59.653Z - 04-07-2020

రేపే చంద్రగహణం.. ఏ గ్రహరాశులపై ప్రభావమో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈఏడాది గ్రహణాల సందడి ఎక్కువైంది. జూన్ 5న ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఏర్పడగా.. జూన్ 21న సూర్యగ్రహణం సంభవించింది. తాజాగా మూడో ఖగోళ సంఘటనకు సమయం ఆసన్నమవుతోంది. అదే జూలై 5న ఏర్పడనున్న చంద్రగ్రహణం గురించి చర్చ సాగుతోంది. జూలై 5వ తేదీకి ఒక ప్రత్యేకత వుంది. ఆదివారం గురుపూర్ణిమ రోజున ఈ గ్రహణం సంభవించనుంది. ఇది ఉపఛాయ చంద్రగ్రహణం అయినప్పటికీ చంద్రుడి పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అంటే చంద్రుడు సాధారణంగా కనిపిస్తాడు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం జనవరిలో ఏర్పడింది. తాజాగా సంభవించనున్న గ్రహణం మూడోది. అంతేకాకుండా ఈ ఏడాది ఏర్పడనున్న చిట్టచివరి చంద్రగ్రహణం ఇదే అంటున్నారు.ఉప ఛాయా చంద్రగ్రహణం కావడంతో చంద్రుడి పరిమాణంలో మార్పులు ఉండవంటున్నారు. 

ఈ నేపథ్యంలో జ్యోతిషశాస్త్రం ప్రకారం రాశిచక్రంలోని 12 రాశులపై ఈ గ్రహణం ప్రభావం చూపుతుందని అంటున్నారు. ప్రత్యేకంగా ఈ చంద్రగ్రహణం వల్ల ఐదు రాశుల వారిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని జాగ్రత్తలు అవసరమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ చంద్ర గ్రహణం మిథున రాశివారిపై అత్యధికంగా ప్రభావం చూపనుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వీలైనంతవరకు వివాదాలు, వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. అన్నీ ఆలోచించిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలి. అంతేకాకుండా మిధున రాశివారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. లేదంటే దీని ప్రభావం పనిని కూడా ప్రభావితం చేస్తుందంటున్నారు. ఖర్చులు పెరిగి, మానసికవత్తిడికి లోనయ్యే ప్రమాదం వుంది. 

భారత దేశంలో ఈ గ్రహణం కనిపించదు. ఇక చంద్రగ్రహణం వల్ల చంద్రుడి పరిమాణంలో మార్పు ఉండదు. జూలై 4న లాస్ ఏంజిల్స్ లో మూడు గంటలపాటు కనిపిస్తుంది. కేప్ టౌన్ లో చంద్రగ్రహణం జూలై 5న కనిపించనుంది. మిధున రాశితో పాటు సింహరాశిపై వుంది. వాహనాల క్రయవిక్రయాలకు దూరంగా ఉండాలి. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కన్యా రాశివారు జాగ్రత్తలు పాటించాలి. ఆహారం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వృశ్చిక రాశివారిపై ప్రభావం ఉంటుంది. రుణాలు తీసుకునేముందు ఆలోచించాలి. వృత్తి, వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు అవసరం. ధనుస్సు రాశివారిపై మానసిక వత్తిడి వుంటుంది. తోబుట్టువులు, పిల్లల విషయంలో అభిప్రాయబేధాలుండవచ్చు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle