newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

మరోసారి కలకలం రేపిన చిరుత... రాజేంద్రనగర్లో టెన్షన్ టెన్షన్

29-05-202029-05-2020 12:15:43 IST
Updated On 29-05-2020 12:21:32 ISTUpdated On 29-05-20202020-05-29T06:45:43.944Z29-05-2020 2020-05-29T06:45:39.209Z - 2020-05-29T06:51:32.757Z - 29-05-2020

మరోసారి కలకలం రేపిన చిరుత... రాజేంద్రనగర్లో టెన్షన్ టెన్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ నగరంలోకి వచ్చిన ఓ చిరుత కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాజేంద్రనగర్ ప్రాంతంలో మరోసారి చిరుత సంచారం స్థానికులను కలవరపెడుతోంది.   గురువారం రాత్రి అగ్రికల్చర్‌ యూనివర్సిటీ సీసీ కెమెరాల్లో చిరుత కనిపించింది. అక్కడి నుంచి చిరుత గగన్‌పహాడ్‌ గుట్టల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా ఆనవాళ్లు లభించాయి. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ, పోలీసు అధికారులు.. చిరుత ఆచూకీ కోసం అన్వేషణ ప్రారంభించారు. 

ఫుట్‌ ప్రింట్స్‌ ఆధారంగా అది అడవిలోని చెరువు దగ్గరకు వెళ్లి నీళ్లు తాగినట్టుగా గుర్తించారు. దీంతో ఆపరిసరాల్లో 20 ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈనెల 14వ తేదీన రెండు కిలోమీటర్ల దూరంలోనే చిరుత సంచరించింది. గండిపేట సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లోకి వెళ్లిన చిరుత అక్కడ నీరు తాగిందని గుర్తించి సంగతి తెలిసిందే. దాని ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. తాజాగా చిరుత కదలికలకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు లభించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

15 రోజులుగా చిరుత అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.  దీంతో సమీప ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. ఈచిరుత తమ పరిధిలోని సీసీ కెమేరాల్లో కనిపించిందని అంతా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఫైరింగ్ రేంజ్ నుంచి ఫోన్ వచ్చిందని సమీపంలోని అపార్ట్ మెంట్స్ సెక్యూరిటీ అధికారి మూర్తి చెప్పారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు రావద్దని ఆయన రాత్రి సూచించారు. ఫైరింగ్ రేంజ్ ఏరియాలో ఈచిరుత అరగంట పాటు తిరిగింది. 

 

 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle