మద్యం దొరకలేదని వృద్ధుడి ఆత్మహత్య
28-03-202028-03-2020 10:00:58 IST
Updated On 28-03-2020 10:56:38 ISTUpdated On 28-03-20202020-03-28T04:30:58.182Z28-03-2020 2020-03-28T04:24:42.849Z - 2020-03-28T05:26:38.469Z - 28-03-2020

కరోనా ఎక్కడ సోకుతుందో అని జనం బయటికి రావడానికి జంకుతున్న వేళ మద్యం దొరకడంలేదని ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. కరోనా లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్క వ్యసనానికి బానిస అయిన తోపుడు బండి రిక్షా కార్మికుడు తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. మండపేట గాంధీ నగర్ రైతు బజార్ ఎదుగా ఉన్న వీధి లో నివసిస్తున్న షేక్ బాజి ఖాన్ వయసు 56 ఏళ్ళు. రిక్షా తొక్కతూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో కరోనా వల్ల అన్ని షాపులు మూతబడ్డాయి. మందు దొరకకపోవడంతో మానసికవ్యధకు గురయ్యాడు. ఈ క్రమంలో మండపేట రవికాంత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పాత సామిల్లు షెడ్డు కు ఉరి వేసుకొని మృతి చెందాడు. నిత్యం మందు తాగితే గానీ బండి నడవదని చెబుతుండేవాడని స్థానికులు పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున రోడ్డుపై వెళుతున్న వారు ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు పాల్పడిన బాజి స్వస్థలం రాజమహేంద్రవరం. జీవనోపాధి కోసం తోపుడు రిక్షా నడుపుతూ బ్రతుకుతున్నాడు .ఈ క్రమంలో రైతు బజార్ సమీపంలో నివసిస్తున్న ఓ వృద్ధురాలితో సహజీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బాని గా మారాడు. కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో మద్యం అమ్మకాలు బంద్ కావడంతో గతమూడురోజులు గా మద్యం దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆత్మహత్య కు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రిక్షాతో పాటు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగుతోంది. కరోనా వైరస్ భయం జనంలో పెరిగిపోతున్న వేళ మద్యం కోసం కొంతమంది ఎన్నో పాట్లు పడుతున్నారు.

ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడికి హిజ్రాగా శస్త్రచికిత్స..
14 hours ago

తొలి వ్యాక్సిన్ పండగ.. మంత్రి ఈటెలకు నేడే
15 hours ago

ఆన్ లైనా.. ఆఫ్ లైనా.. ఏది బెటర్
15-01-2021

తెలంగాణ ప్రజలకు కంటి మీద కునుకే లేదు
15-01-2021

బర్డ్ ఫ్లూ.. తెలంగాణను కూడా చేరిందా..?
14-01-2021

పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న ఉత్తరాది
14-01-2021

తెలంగాణలో తొలి కరోనా వ్యాక్సిన్ వేయించుకునేది అతడే..!
14-01-2021

ప్రాంక్ షో.. అశ్లీల ప్రశ్నలు ఆడవాళ్లను అడుగుతుండడంతో తాట తీస్తున్న పోలీసులు..!
13-01-2021

భోగి పండుగ అంటే ఏమిటి?
13-01-2021

సిటీ ఖాళీ.. రోడ్లపై జాలీ
12-01-2021
ఇంకా