newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

ప్రాణం తీసిన మొబైల్.. బాలుడి ఆత్మహత్య

03-06-202003-06-2020 13:08:23 IST
Updated On 03-06-2020 15:47:45 ISTUpdated On 03-06-20202020-06-03T07:38:23.377Z03-06-2020 2020-06-03T07:35:35.553Z - 2020-06-03T10:17:45.840Z - 03-06-2020

ప్రాణం తీసిన మొబైల్.. బాలుడి ఆత్మహత్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చిన్న చిన్న విషయాలకే పిల్లలు కూడా మనస్తాపానికి గురవుతున్నారు. మొబైల్ కోసం గొడవపడి ముక్కుపచ్చలారని కుర్రాడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం ధోర్ణ కంబాలలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. 

సుమతి,రాజు భార్యాభర్తలు. వీరికి ఇరువురు సంతానం ముని విద్య, ముని తేజ. వీరిద్దరి తరచూ మొబైల్ ఫోన్ కోసం గొడవపడుతుంటారు. సెల్ ఫోన్ కోసం అక్క తమ్ముడు మధ్య తగాదా ఏర్పడింది. అది కాస్తా తీవ్రంగా మారింది, దీంతో తండ్రి మందలించాడు. అది నచ్చని కుర్రాడు మునితేజ బెడ్ రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

మునితేజ ఎంతసేపటికీ రూమ్ నుండి బయటకు రాకపోవడంతో గడ్డపారతో తలుపు తొలగించి చూసిన తల్లిదండ్రులు షాకయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న కొడుకు మునితేజని 108 వాహనంలో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే కుర్రాడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతి చెందిన కుమారుని చూసి కన్నీరుమున్నీరు ఆవుతున్నారు తల్లిదండ్రులు, బంధువులు. ఈ సంఘటనతో  కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నకారణంతోనే చిన్నపిల్లాడు ఆత్మహత్యకు పాల్పడడంపై ఆవేదన వ్యక్తం అవుతోంది. 

ఈమధ్యే టిక్ టాక్ కారణంగా విజయవాడలో కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లీకొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆకుటుంబంలోొ విషాదం నెలకొంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle