newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

ప్రకృతి బీభత్సాలకు తలొగ్గని ఆలయం

28-05-202028-05-2020 19:03:26 IST
2020-05-28T13:33:26.245Z28-05-2020 2020-05-28T13:32:44.245Z - - 06-07-2020

ప్రకృతి బీభత్సాలకు తలొగ్గని ఆలయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అది దేవుడి మహిమో ఏమో తెలీదు. భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచినా మహాలక్ష్మి మోక్ష నారాయణ, వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చెక్కుచెదరడం లేదు. వర్షాలకు పెద్దపెద్ద వృక్షాలు సైతం గాలి తాకిడికి కూకటివేళ్లతో సహా పెకిలించి కొని కిందపడుతున్న వైనం మనం చూస్తుంటాం. కానీ కడప జిల్లా  కమలాపురం ప్రాంతంలో ఈమధ్యే ప్రకృతి బీభత్సం అందరినీ భయకంపితులను చేసిందనే చెప్పాలి. ఈ అకాలవర్షం, గాలులతో, జనమంతా అతలాకుతలం అయ్యారు. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.

పెద్దపెద్ద వృక్షాలు సైతం నేలకొరిగాయి, సిమెంటు రేకులతో సైతం వేసిన ఇల్లు గాలికి లేచిపోయాయి. రేకులు కప్పుకొని నివశిస్తున్న గృహాలలోని నిరుపేదలు నిరాశ్రయులయ్యారు. ఇంతటి బీభత్సం సృష్టించిన గాలివాన కమలాపురం మండలం రామాపురం పుణ్య క్షేత్రంలోని మోక్ష నారాయణ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గర్భగుడి గోపురాలు కట్టిన చిన్న ధారపు పొరను మాత్రం కదిలించలేక పోయింది. 

ఆలయంలో ఇటీవల బ్రహ్మోత్సవాలు నిర్వహించారు, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా నిత్యకళ్యాణ మూర్తులుగా మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామి, వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి  ఇక్కడ కొలువై ఉన్నారు. హరిహర దేవతామూర్తుల ఇద్దరికీ ఒకే వేదికపై ఈ భూ ప్రపంచంలో నిత్య కళ్యాణ మహోత్సవం జరిగే ఏకైక పుణ్యక్షేత్రంగా రామాపురం క్షేత్రం విరాజిల్లుతోంది. ఇటువంటి పుణ్యక్షేత్రంలో దేవతా మూర్తులు స్వయంగా కొలువై ఉంటారు అని చెప్పడానికి నిదర్శనంగా భాసిల్లుతోంది. గాలివాన వాయు వేగంతో  కదులుతున్నప్పటికీ ఈ క్షేత్రంలోని ఆలయ గర్భగుడి గోపురాలకు కట్టిన చిన్న దారపు పోగులు మాత్రం తెగిపోకుండా అలాగే ఉండడం చాలా విచిత్రం కలిగిస్తోంది. 

https://www.photojoiner.net/image/3JVTLvlk

వర్షాల అనంతరం ఆలయానికి వెళ్ళిన భక్తులు  గర్భగుడి గోపురాలకు  కట్టిన దారం తెగిపోకుండా ఉండడం చూసి  చాలా ఆశ్చర్యం చెందారు. పెద్దపెద్ద వృక్షాలు సైతం నేల కొరిగిపోయాయి. ఈ ఆలయంలోని గర్భగుడి గోపురాలకు కట్టిన దారం తెగిపోకుండా ఉండడం దేవతామూర్తుల మహిమేనని భక్తులు పేర్కొంటున్నారు .

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle