newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

దుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు

03-07-202003-07-2020 09:37:43 IST
2020-07-03T04:07:43.830Z03-07-2020 2020-07-03T04:07:30.061Z - - 03-08-2020

దుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. అయితే కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. 

మేళతాళాలతో మంగళవాయిద్యాలతో శాకంబరీ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారికి  అలంకరణ చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా అమ్మవారి దర్శనం లభించనుంది. రోజుకి ఆరు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. అమ్మవారి దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు కల్పించారు. 

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు నేటి నుంచి మూడురోజులపాటు శాకంబరి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎం.వి.సురేష్ బాబు తెలిపారు. వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారి అలంకారం జరుగుతుందని, మూడు రోజుల పాటు అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులను తక్కువ సంఖ్యలోనే అనుమతిస్తామన్నారు. 

ఈసందర్భంగా ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. ఆలయప్రాంగణం అంతా పచ్చని కూరగాయల తో అలంకరణ చేస్తారు. వేలాదిగా భక్తులు అమ్మవారిని శాకాంబరి మాత గా దర్శించుకోవడానికి వస్తారు. వర్షాకాలం ప్రారంభమైన తరువాత కూరగాయలతో అమ్మవారిని అర్చించడం ద్వారా రైతులకు ఫలసాయం బాగా వచ్చి..లోకమంతా పచ్చగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు.

అన్ని నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారిని శాకాంబరి గా దర్శించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చూస్తున్నారు. ఇక ఈ సందర్భంగా ప్రజలు కూడా అమ్మవారికి కూరగాయలను కానుకగా సమర్పిస్తుంటారు. సందడి తక్కువగా ఉన్నా ఏటా జరిగే శాకంబరి ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అధికారులు. శాకాంబరీ దేవిగా అమ్మవారిని దర్శించుకుంటే ఆహారానికి లోటుండదని అర్చకులు చెబుతున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle