newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

తమిళ నాట కస్టడీ డెత్.. పోలీసుల అరెస్ట్‌తో సంచలనం

02-07-202002-07-2020 20:08:27 IST
2020-07-02T14:38:27.845Z02-07-2020 2020-07-02T14:34:06.063Z - - 03-08-2020

తమిళ నాట కస్టడీ డెత్.. పోలీసుల అరెస్ట్‌తో సంచలనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ ఉల్లంఘన కేసులో అరెస్టయి పోలీసుల కస్టడీలో ఇద్దరు మరణించడంతో అందుకు కారణమయిన పోలీసులపై కేసు నమోదయింది. తమిళనాడుకు చెందిన జయరాజ్‌, బెనిక్స్‌ కస్టడీ డెత్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులను తీవ్రంగా గాయపరిచి వారి మృతికి కారణమైన ప్రధాన నిందితుడు, సబ్‌ ఇన్ స్పెక్టర్‌ రఘు గణేశ్‌తో పాటు మరో ఎస్సై బాలకృష్ణన్‌ సహా ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారు. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 302 ప్రకారం హత్యానేరం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు సీబీసీఐడీ పోలీసులు.

దేశవ్యాప్తంగా కస్టడీ డెత్ సంచలనం కలిగించింది. దీనిపై విపక్షాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు సైతం తీవ్రంగా స్పందించాయి. వీరిద్దరి కస్టడీ డెత్‌తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇతర పోలీసులను కూడా విచారిస్తున్నట్లు తెలిపాయి. ఇందుకోసం 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా జయరాజ్‌, బెనిక్స్‌ల దారుణ మృతికి కారణమైన వారికి కఠిన శిక్షలు తప్పవంటూ తమిళనాడు న్యాయశాఖా మంత్రి సీ వీ షణ్ముగం ప్రకటించిన కొన్ని గంటల్లోనే నిందితులు అరెస్టయ్యారు. 

కస్టడీ డెత్‌ నిందితులను పోలీసులు అరెస్టు చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. దీంతో తూత్తుకుడిలో సంబరాలు మొదలయ్యాయి. టపాసులు పేలుస్తూ స్థానికులు సంతోషం వ్యక్తంచేశారు.  సత్తాన్‌కుళం పోలీసు స్టేషన్‌లో పనిచేసే పోలీసులంతా ఈ కేసులో అరెస్టు అవుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఆ స్టేషన్‌ రెవెన్యూ విభాగం నియంత్రణలోకి వెళ్లింది. 

అసలేం జరిగిందంటే.. 

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో  తూత్తుకుడి జిల్లా కోవిల్‌ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు 59 ఏళ్ళ జయరాజ్‌, 31 ఏళ్ల బెనిక్స్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కస్టడీలోకి తీసుకుపని పోలీసులు వారిని చిత్ర హింసలు పెట్టారు. దీంతో వారిద్దరు చనిపోయారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. పోలీసుల తీరుపై మండిపడ్డ ప్రజాసంఘాలు బాధితులైన జయరాజ్‌, బెనిక్స్‌లకు న్యాయం జరగాలంటూ సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మద్రాస్‌ హైకోర్టు.. జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికలో పోలీసుల కర్కశత్వం, సత్తాన్‌కులం పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు చట్టం పట్ల ఉన్న గౌరవ మర్యాదలు ఏపాటివో తెలియజేస్తూ మెజిస్ట్రేట్‌ నాలుగు పేజీల నివేదిక అందజేశారు. దీని ఆధారంగా పోలీసులపై చర్యలు చేపట్టడంతో ప్రజాసంఘాలు శాంతించాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle