newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

డబ్బుల కోసం సొంత నానమ్మనే చంపేసిన మనవడు

02-06-202002-06-2020 12:41:50 IST
Updated On 02-06-2020 14:06:08 ISTUpdated On 02-06-20202020-06-02T07:11:50.114Z02-06-2020 2020-06-02T07:02:33.452Z - 2020-06-02T08:36:08.063Z - 02-06-2020

డబ్బుల కోసం సొంత నానమ్మనే చంపేసిన మనవడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మానవ సంబంధాల్లో సున్నితత్వం, బంధుత్వాలు పోతున్నాయి. కేవలం డబ్బులకోసం అయినవారని కూడా చూడకుండా వారిని అంతం చేస్తున్నారు. యువకులు కూడా తీవ్ర ఆవేశాలకు లోనవుతున్నారు. తాజాగా జరిగిన ఘటన మానవత్వాన్ని మంటగలిపేలా చేసింది. 

డబ్బుల కోసం ఓ మనవడు స్వంత నాన్నమ్మనే చంపేశాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల్ శ్రీరామ్ నగర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసిందీ ఘటన. ఊళ్ళో జులాయిగా తిరుగుతున్న మనవడికి డబ్బులు ఇవ్వను అన్నందుకు కోపంతో రగిలిపోయాడు. అంతే విచక్షణ మరిచిపోయి నాన్నమ్నని హతమార్చాడు శివలింగం అనే కుర్రాడు. 

నాన్నమ్మను ఒక్కడే హత్యచేశాడా ఇంకెవరైనా ఉన్నారా అన్నకోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మొయినబాద్ పోలీసులు. గతంలో కూడా ఇంట్లో డబ్బులు తీసుకొని జులాయిగా తిరిగి డబ్బులు అయిపోయాక ఇంటికి చేరుకునేవాడు శివలింగం. 

ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు సమీప బంధువు ఇంటికి వెళ్లడంతో  డబ్బులకు నాన్నమ్మ వేధించాడు యువకుడు. ఆదివారం రాత్రి హత్యచేసి ఉండవచ్చని అంటున్నారు స్థానికులు. హత్య చేసిన తర్వాత ఊళ్ళోనే తిరుగుతున్నాడు నిందితుడు శివలింగం. నిందితుని వయస్సు 16 సంవత్సరాలు ఉండొవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. 

ప్రేమ వ్యవహారంలో యువకుడి బలి

https://www.photojoiner.net/image/qsMMKIh7

కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారం యువకుడి ప్రాణాలను బలిగొంది. రుద్రవరం మండలంలోని పేరూరు గ్రామంలో ఒక ప్రేమ జంట పరారైంది. ప్రేమ జంటకు మధ్యవర్తిగా సహకరించాడని యువకుడు ప్రవీణ్ కుమార్ పై అమ్మాయి తరపు బంధువులు విచక్షణా రహితంగా దాడి చేశారు. 

దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రవీణ్ కుమార్‌ను ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు ప్రవీణ్ కుమార్. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితులు పరారీలో వున్నారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle