newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

కోవిడ్ రోగుల పట్ల వివక్ష వద్దు.. మానవత్వమే ముద్దు

05-07-202005-07-2020 09:49:31 IST
Updated On 05-07-2020 10:25:27 ISTUpdated On 05-07-20202020-07-05T04:19:31.553Z05-07-2020 2020-07-05T04:19:25.838Z - 2020-07-05T04:55:27.711Z - 05-07-2020

కోవిడ్ రోగుల పట్ల వివక్ష వద్దు.. మానవత్వమే ముద్దు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్-19పై అపోహలను తొలగించుకోవాల్సిన అవసరం వుంది. కోవిడ్ రోగుల పట్ల వివక్షను అరికట్టి కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడాలి. దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఇటువంటి తరుణంలో వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు నిత్యం వారి ప్రాణాలను ఫణంగా పెట్టి మన కోసం ముందుండి పోరాడుతున్నారు. 

మనం క్షేమంగా ఉండాలని వాళ్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ లో చాలా మంది కోవిడ్-19 బారినపడుతున్నారు.మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారు చేస్తున్న సేవలను ప్రశంసించాలి, అంతేకానీ ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్న వారిపట్ల, వారి కుటుంబాల పట్ల వివక్ష చూపకూడదు. 

అదే విధంగా వారి గురించి గానీ, కోవిడ్-19 గురించి గానీ తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదు. ఈ సంక్షోభ సమయంలో పుకార్లు మరియు తప్పుడు సమాచారం వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల్లో తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. అంతే కాకుండా ఇటువంటి పరిణామాలు కోవిడ్-19 బాధితుల రికవరీపైనా ప్రభావం చూపుతాయి. 

ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను పాటించడం ఎంతో శ్రేయస్కరం. అందరూ వీటిని పాటించి కోవిడ్-19 కు వ్యతిరేకంగా ఏకం కావాలి. ఇవి నాకు వర్తించదు అని ఎవరు అనుకున్నా వారు తమను ఇతరులను కూడా ప్రమాదంలో నికి నెడుతున్నారని గమనించాలి. మీ చిన్నపాటి నిర్లక్ష్యం మీ తోటివారికి అపాయం కలిగిస్తుంది. శానిటైజర్ వాడండి. చేతులు శుభ్రంగా కడుక్కోండి.

బయటకు వెళ్లడం తగ్గించండి. అత్యవసరం అయితే ముఖానికి మాస్కు పెట్టుకుని బయటకు వెళ్ళివచ్చిన వెంటనే మీరు చేతులు కడుక్కోండి. కోవిడ్ బారిన పడి మరణించిన వారి అంత్యక్రియలకు అంతరాయం కలిగించవద్దు. మానవత్వంతో ఆలోచించాలి. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle