newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

కొండెక్కిన కూరగాయల ధరలు. సామాన్యుల గగ్గోలు

04-06-202004-06-2020 12:42:12 IST
Updated On 04-06-2020 15:36:17 ISTUpdated On 04-06-20202020-06-04T07:12:12.522Z04-06-2020 2020-06-04T07:12:03.700Z - 2020-06-04T10:06:17.301Z - 04-06-2020

కొండెక్కిన కూరగాయల ధరలు. సామాన్యుల గగ్గోలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా నియంత్రణ కోసం పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయంలో తక్కువ ధరలకు లభించిన కూరగాయలు ప్రస్తుతం చుక్కలు చూపిస్తున్నాయి. లాక్‌డౌన్‌లో కిలో రూ.10 నుంచి రూ.20 లోపు లభించగా ప్రస్తుతం అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పచ్చిమిర్చి ఘాటెక్కిస్తోంది. ఇటీవల కిలో రూ.20 పలికిన పచ్చిమిర్చి ఇప్పుడు హోల్‌సెల్‌లో రూ.50 కాగా రిటైల్‌గా రూ.60కి చేరింది. బీన్స్‌, కాకర, చామదుంప, బంగాళదుంప, వంటి కూరగాయలు రూ.30 దాటిపోగా, పెద్దచిక్కుళ్ళు కిలో రూ.60కి చేరింది.    

లాక్‌డౌన్‌ సమయంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజానీకం ఉదయం సమయంలో నగరంలోని అన్ని ప్రాంతాల్లో తోపుడు బండ్ల ద్వారా కూరగాయలను విక్రయించారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో తాత్కాలికంగా కూరగాయల వ్యాపారం చేసిన వారంతా తమ వృత్తుల్లోకి వారు వెళ్ళిపోయారు. దీంతో ఇప్పుడు గతంలో చేసిన వ్యాపారులు మాత్రమే కూరగాయలు విక్రయిస్తుండటంతో వాటి ధరలు ఆకాశాన్నంటాయి. 

ఎండాకాలం కావడం, వర్షాలు పడకపోవడం నీటిఎద్దడి కారణంగా కూరగాయల సాగు తగ్గిపోయింది. దీనికి తోడు కరోనా వైరస్ మహమ్మారి వల్ల కూలీలు కూడా అందుబాటులో లేరు. దీంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయింది. డిమాండ్ కు తగ్గట్టుగా సప్లయ్ లేకపోవడంతో మార్కెట్లోకి వచ్చే కూరగాయలు కూడా తగ్గాయి. రోజురోజుకు వాటి ధరలు పెరిగిపోతున్నాయి. వానలు పడితే తప్ప కూరగాయల ధరలు తగ్గే అవకాశం లేదంటున్నారు వ్యాపారులు. 

మరో వైపు కృష్ణా జిల్లాలో చిరు వ్యాపారులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద రామవరప్పాడు వ్యాపారస్తులు ఆందోళన చేశారు. వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన తెలిపారు. లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా ఇండ్లకే పరిమితమైయ్యామంటూ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాల‌ నిర్వహణకు అనుమతి ఇచ్చిన పడమట పోలీసులు అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామవరప్పాడు ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదంటున్నారు వ్యాపారస్తులు. వెంటనే వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్ ఇంతియాజ్ క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఇటు చికెన్ ధరలు కూడా  బాగా పెరిగిపోవడంతో ఏం వండాలో, ఏం తినాలో అర్థం కావడం లేదని గృహిణులు గగ్గోలు పెడుతున్నారు.

ఉజ్జయినీ అమ్మవారికి బంగారు బోనం సమర్పణ

ఉజ్జయినీ అమ్మవారికి బంగారు బోనం సమర్పణ

   11 hours ago


Mosquito Tornado: దోమల సుడిగాలి.. వీడీయో వైరల్, మీరు కూడా చూడండి

Mosquito Tornado: దోమల సుడిగాలి.. వీడీయో వైరల్, మీరు కూడా చూడండి

   20-07-2021


Hyderabad: 16 ఏళ్ల  కూతురికి అన్నంలో నిద్ర మాత్రలు కలిపి కన్న తండ్రే కసాయివాడు అయ్యాడు

Hyderabad: 16 ఏళ్ల కూతురికి అన్నంలో నిద్ర మాత్రలు కలిపి కన్న తండ్రే కసాయివాడు అయ్యాడు

   20-07-2021


16 ఏళ్ల బాలిక పై భవన నిర్మాణ కార్మికుడి పైశాచికం.. అనారోగ్యానికి గురైన బాలిక

16 ఏళ్ల బాలిక పై భవన నిర్మాణ కార్మికుడి పైశాచికం.. అనారోగ్యానికి గురైన బాలిక

   19-07-2021


ఈ రోజు సుప్రీం కోర్టు బిజీలోని ముఖ్యాంశాలు పావురాలు, పాలిసీ, యాత్రికులు మరియు జైళ్ళు

ఈ రోజు సుప్రీం కోర్టు బిజీలోని ముఖ్యాంశాలు పావురాలు, పాలిసీ, యాత్రికులు మరియు జైళ్ళు

   18-07-2021


ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ గణేష్‌ రూపం ఇదే.. గణేష్ చిత్రపటం ఆవిష్కరణలో ఉద్రిక్తత

ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ గణేష్‌ రూపం ఇదే.. గణేష్ చిత్రపటం ఆవిష్కరణలో ఉద్రిక్తత

   17-07-2021


Prakasam: కన్న తండ్రే  15 ఏళ్ల కుమార్తెపై కన్నేశాడు.. పలుమార్లు అత్యాచారం.. చివరికి

Prakasam: కన్న తండ్రే 15 ఏళ్ల కుమార్తెపై కన్నేశాడు.. పలుమార్లు అత్యాచారం.. చివరికి

   15-07-2021


షెయిన్ భారతదేశంలో తిరిగి వస్తోంది.. భారతీయ ఫ్యాషన్‌ వాదుల రెడీ

షెయిన్ భారతదేశంలో తిరిగి వస్తోంది.. భారతీయ ఫ్యాషన్‌ వాదుల రెడీ

   15-07-2021


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, అతలాకుతలం అయిన భాగ్యనగరం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, అతలాకుతలం అయిన భాగ్యనగరం

   15-07-2021


7 ఏళ్ల కోయంబత్తూర్ బాలుడి స్పూఫ్ వీడియో వైరల్ అయ్యింది

7 ఏళ్ల కోయంబత్తూర్ బాలుడి స్పూఫ్ వీడియో వైరల్ అయ్యింది

   14-07-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle