newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

కూతురి ప్రేమపై ఆగ్రహం.. మంత్రి గన్‌మెన్ వీరంగం

21-06-202021-06-2020 11:06:45 IST
Updated On 21-06-2020 11:06:30 ISTUpdated On 21-06-20202020-06-21T05:36:45.975Z21-06-2020 2020-06-21T05:35:49.139Z - 2020-06-21T05:36:30.792Z - 21-06-2020

కూతురి ప్రేమపై ఆగ్రహం.. మంత్రి గన్‌మెన్ వీరంగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈడొచ్చిన పిల్లలు ప్రేమలో పడడం కామన్. కానీ పెద్దలు వారి ప్రేమను అంగీకరించడం చాలా అరుదు. తాజాగా ఓ ప్రేమజంట వ్యవహారం పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంత్రి వనిత గన్ మెన్ వీరంగం సృష్టించారు. కూతురు, అల్లుడిపై దాడికి పాల్పడ్డాడు మంత్రి తానేటి వనిత గన్ మెన్ చంద్రరావు. ఆయన ఆగ్రహానికి కారణం ప్రేమ వివాహం. ఐదు నెలల క్రితం తన కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో ప్రధాన రహదారిపై దాడికి పాల్పడ్డాడు గన్ మెన్. 

మంత్రి దగ్గర పనిచేస్తే మాత్రం ప్రేమికుల మీద రహదారులపై దాడులకు పాల్పడటం దారుణమంటున్నారు స్థానికులు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వద్ద పనిచేసే గన్ మెన్ కూతురి మీద దాడి చేయడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. దాడికి పాల్పడిన చంద్రరావుతో పాటు పలువురిపై ఏలూరు టూ టౌన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.

కూతురు ప్రేమవివాహం చేసుకుని తన పరువు తీసిందనే ఆగ్రహంతోనే మంత్రి గన్ మెన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు స్థానికులు అంటున్నారు. సినిమా ఫక్కీలో  కుమార్తెను, అల్లుడ్ని వెంట తరుముతూ, విచక్షణ రహితంగా కొడుతూ చూపరులకు భయోత్పాతం కలిగించాడు గన్ మెన్. ఓ అబ్బాయిని ప్రేమించిన గన్ మెన్ చంద్రారావు కూతురు పోలీసుల సమక్షంలో పెళ్ళి చేసుకుంది. అప్పటినుంచి గన్ మెన్ కూతురు, అల్లుడిపై కోపంతో వున్నాడు. అదను చూసి ఇలా దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle