newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

కశింకోటలో విషాదం.. స్పిరిట్ తాగి ఐదుగురు మృతి

01-06-202001-06-2020 11:42:36 IST
Updated On 01-06-2020 14:41:54 ISTUpdated On 01-06-20202020-06-01T06:12:36.895Z01-06-2020 2020-06-01T06:12:28.521Z - 2020-06-01T09:11:54.757Z - 01-06-2020

కశింకోటలో విషాదం.. స్పిరిట్ తాగి ఐదుగురు మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మద్యం మత్తు ప్రాణాల మీదకు తెస్తోంది. విశాఖ జిల్లాలో కశింకోట గోవిందరావు కాలనీలో  తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మత్తు కోసం సర్జికల్ స్పిరిట్ తాగి తొలుత ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గోవిందరావు కాలనీకి చెందిన కూనిశెట్టి ఆనంద్‌ రావ్‌ స్నేహితులతో పార్టీ చేసుకుందామని భావించారు. కిక్‌ కోసం మత్తు ఎక్కువగా ఉంటుందని స్పిరిట్‌ను తీసుకొని వచ్చాడు. 

ఈ పార్టీలో ఆరుగురు పాల్గొనగా.. నలుగురు స్పిరిట్‌ తాగారు. కాగా తాగిన వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా మృతి చెందిన వారిలో వడిసెల నూకరాజు, కూనిశెట్టి ఆనంద్, పెతకం శెట్టి అప్పారావులుగా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. 

మృతుల్లో ఒకరు మందుల కంపెనీలో కార్మికుడు కావడంతో అక్కడి నుంచి గుట్టుగా సర్జికల్‌ స్పిరిట్‌ తీసుకొచ్చాడు.  స్పిరిట్ తాగినవారిలో  కునిశెట్టి ఆనంద్‌(55), వడిశల నూకరాజు(61), పెతకంశెట్టి అప్పారావు(50) అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. వీరిలో ఆనంద్‌, నూకరాజు ఇంటిలోనే మృతిచెందగా.. అప్పారావు విశాఖపట్నం కేజీహెచ్‌లో మృతిచెందారు. స్పిరిట్‌ తాగిన మాణిక్యం, దొరబాబు కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle