newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులకు చస్తే వెళ్లం.. ఫీజులతో పీల్చేస్తారంటున్న సర్వే జనం

01-06-202001-06-2020 06:41:32 IST
Updated On 01-06-2020 09:29:28 ISTUpdated On 01-06-20202020-06-01T01:11:32.966Z01-06-2020 2020-06-01T01:11:30.572Z - 2020-06-01T03:59:28.889Z - 01-06-2020

కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులకు చస్తే వెళ్లం.. ఫీజులతో పీల్చేస్తారంటున్న సర్వే జనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ నేపథ్యంలో గత 70 రోజులుగా రోగులు లేక, రోగులు రాక ఖాళీగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు చేదు వార్త. లాక్ డౌన్ క్రమక్రమంగా ఎత్తివేసినా కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రుల జోలికి వెళ్లమంటూ జనం భావిస్తున్నారు. ఒక సర్వే చెప్పిన దాని ప్రకారం కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నట్టు తెలిసింది. కోవిడ్‌ చికిత్సలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సేవలపై ప్రజల అభిప్రాయం అనే అంశంపై జరిగిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళతామని, వెళ్లమని చెప్పిన వారి కంటే అసలు ఆసుపత్రుల జోలికే వెళ్లబోమని చెప్పేవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం.

లోకల్‌ సర్కిల్స్‌ అనే సోషల్‌ మీడియా ఫ్లాప్‌ఫాం ఈ అధ్యయనం చేసింది. ఐదు ప్రశ్నలతో కూడిన తమ స్టడీ 40 వేల మందిపై సాగిందని నిర్వాహకులు తెలిపారు. కోవిడ్‌ చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రుల అధిక చార్జీల బాదుడు తట్టుకోలేమని 57 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే సెకండరీ కాంటాక్టు ద్వారా వైరస్‌ బారిన పడతామని మరో 46 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. 

పైగా కరోనా చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రుల చార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని..  ఒక నిర్ణీత మొత్తం ఫిక్స్‌ చేయాలని 61 శాతం మంది కోరుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా చికిత్సకు సరిపడా వైద్య సదుపాయాలు లేవని 32 శాతం మంది చెప్పుకొచ్చారు. 

ఒకవేళ కరోనా బారిన పడితే చికిత్స కోసం ఏ ఆస్పత్రికి వెళ్తారనే ప్రశ్నకు.. 32 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులకు, 22 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రుల వైపు మొగ్గు చూపారు. మరో 32 శాతం మంది అసలు ఆస్పత్రులకే వెళ్లమని అంటున్నారు. ఇంటి వద్దే చికిత్స తీసుకుంటామని, పరిస్థితి తీవ్రంగా ఉంటేనే ఆస్పత్రికి వెళ్తామని చెప్తున్నారు. 14 శాతం మంది మాత్రం కచ్చితంగా ఫలానా ఆస్పత్రికి వెళ్తామని చెప్పమలేమన్నారు.

కరోనా లాక్‌డౌన్‌తో అందరి ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయని, ఖరీదైన వైద్య ఖర్చులు భరించే శక్తి లేదని తమ అధ్యయనంలో భాగమైన ప్రజలు చెప్తున్నారని లోకల్‌ సర్కిల్స్ జనరల్‌ మేనేజర్‌ అక్షయ్‌ గుప్తా వెల్లడించారు. ప్రజల అభిప్రాయాల నివేదికను కేంద్ర ఆరోగ్యశాఖకు అందించామని తెలిపారు. ‌కాగా, దేశంలో కరోనా కేసులు బయటపడిన తొలినాళ్లలో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యానికి అనుమతించారు. అనంతరం ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కోవిడ్‌ చికిత్సకు అనుమతినిచ్చారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle