newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

కరోనా ఎఫెక్ట్.. సివిల్ సర్వీసెస్ అభ్యర్ధులకు వెసులుబాటు

02-07-202002-07-2020 08:37:59 IST
2020-07-02T03:07:59.143Z02-07-2020 2020-07-02T03:07:47.354Z - - 03-08-2020

కరోనా ఎఫెక్ట్.. సివిల్ సర్వీసెస్ అభ్యర్ధులకు వెసులుబాటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్న వేళ వివిధ పరీక్షల షెడ్యూళ్ళు మారుతోంది. అయితే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల షెడ్యూల్ మాత్రం యథావిధిగా కొనసాగనుంది. అభ్యర్ధులకు మాత్రం ఒక అవకాశం ఇచ్చింది. అక్టోబర్ 4న జరిగే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలు మార్చుకునేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్ సీ) అవకాశం కల్పించింది. 

కరోనా కారణంగా తమ పరీక్ష కేంద్రాలు మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలంటూ పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చిన నేపథ్యంలో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.అలాగే సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్‌తో పాటు ఐఎఫ్ ఎస్  మెయిన్స్ పరీక్షల కేంద్రాలూ మార్చుకునేందుకూ అవకాశం ఉంటుందని తెలిపింది యూపీఎస్ సీ.పరీక్షా కేంద్రం మార్పు ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని తెలిపింది కమిషన్ . 

తొలి దశ జులై 7 నుంచి 13 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు, రెండో దశ జులై 20 నుంచి 24 సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని పేర్కొంది. upsconline.nic.in లోకి వెళ్లి మార్చుకోవాలని సూచించింది. సదరు పరీక్షా కేంద్రాల్లో అవకాశాలను బట్టి.. ఆ కేంద్రాన్ని కేటాయిస్తామని కమిషన్ వివరించింది. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే తొలి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది. 

ఒకవేళ వారు కోరుకున్న కేంద్రం కేటాయించేందుకు సీలింగ్ కారణంగా కుదరకుంటే మరో పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవచ్చని తెలిపింది. లక్షలాదిమంది అభ్యర్ధులు పరీక్షా రాయనున్నారు. కరోనా వైరస్ కారణంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి అవకాశాలను బట్టి, కరోనా వైరస్ పరిస్థితులను బట్టి అభ్యర్ధులు తమ పరీక్షా కేంద్రాన్ని మార్చుకోవాల్సి వుంటుంది. అయితే అభ్యర్థి కోరే సెంటర్ లో ఇప్పటికే కెపాసిటీ పూర్తి అయితే  వారికి  ఆ కేంద్రంలో అవకాశం లభించదు.  దానికోసం వారు ప్రత్యామ్నాయ కేంద్రాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle