newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

‘ఓంక్యాప్’తో నిరుద్యోగులకు మంచిరోజులు

04-06-202004-06-2020 09:53:00 IST
Updated On 04-06-2020 10:17:53 ISTUpdated On 04-06-20202020-06-04T04:23:00.810Z04-06-2020 2020-06-04T04:22:54.430Z - 2020-06-04T04:47:53.281Z - 04-06-2020

‘ఓంక్యాప్’తో నిరుద్యోగులకు మంచిరోజులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ప్రభుత్వం వివిధ ప్రావీణ్యాలుయ కలిగిన యువతీ, యువకులకు అద్భుతమయిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టింది. ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (OMCAP ఓంక్యాప్) ద్వారా రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేచర్యలు తీసుకుంటోంది. 

అంతర్జాతీయ మార్కెట్ లో రాబోయే ఉద్యోగ అవకాశాలను ఎప్పటికప్పుడు అంచనా వేయడం, ముఖ్యంగా కరోనా ఉధృతి తగ్గిన తర్వాత హెల్త్ సెక్టార్ లో నర్సులు, డాక్టర్లు, ఇతర ఆరోగ్య నిపుణుల సమాచారం ఎప్పటికప్పుడు సేకరించనుంది. సంబంధిత ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా వంటపని, టెక్నీషియన్స్, మహిళా పనిమనుషులకు అవకాశాలు ఉంటున్న నేపథ్యంలో అక్కడ పనిచేయడానికి అవసరమైన విధంగా మనవారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు భద్రతతో కూడిన ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకుంటుంది.  

ముఖ్యంగా విదేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే పలువురు వర్కర్లకు వారి నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా ఓవర్సీస్ స్కిల్స్ రిజిస్టర్ ను తయారు చేయాలి. ఆసక్తి, అనుభావాన్ని బట్టి మన రాష్ట్రంలో కానీ లేదా దేశ విదేశాలలో కానీ వారికి అవసరమైన ఉద్యోగ సహకారం అందించనుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఓం క్యాప్ వెబ్ సైట్ ను మరింత ఆధునీకరించి విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. 

జూలై నెలలో మన దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారుల సహకారంతో గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయాల్లోని అంబాసిడర్లతో సంప్రదించి రాష్ట్రంలో అమలవుతున్న నైపుణ్యశిక్షణా కార్యక్రమాల గురించి వారికి తెలియజేయనుంది. తద్వారా ఎక్కువ మంది విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం జూలై నెలలో మంత్రి ఓం క్యాప్ చైర్మన్ మేకపాటి గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ఒక బృందం గల్ప్ దేశాల్లో పర్యటించేలా ప్రణాళిక సిద్దం చేసింది, ఈ టీం జపాన్, స్వీడన్, ఇటలీ, జర్మనీతోపాటు యూరప్ దేశాల్లో పెద్ద సంఖ్యలో ఉగ్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని, వాటిని మన రాష్ట్రంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, టెక్నీషియన్లు, ఇతర నైపుణ్యాలు ఉన్నవారు పొందేలా ఓంక్యాప్ కృషి చేస్తుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle