newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఐదుగురి ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

03-07-202003-07-2020 19:44:41 IST
2020-07-03T14:14:41.461Z03-07-2020 2020-07-03T14:13:29.731Z - - 03-08-2020

ఐదుగురి ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏ సరదా అయినా ప్రాణాలను హరించేదిగా ఉండకూడదు. మహారాష్ట్రలో జలపాతం దగ్గరికి వెళ్లి సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు.పాల్గర్ జిల్లాలోని కాల్ మాండవి జలపాతం దగ్గర జరిగిన ఈ ప్రమాదం విషాదం నింపింది. అక్కడ సరదా కోసం వెళ్లిన యువకుల్లో ఇద్దరు సెల్ఫీల కోసం ప్రయత్నం చేశారు. నీటి వేగం ఎక్కువగా ఉండడంతో ఆ ప్రవాహాన్ని తట్టుకోలేకపోయారు.

ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు నీటిలోకి దిగిన మరో ముగ్గురు ఆ ప్రవాహంలోకి వెళ్లిపోయారు. ప్రమాదంలో ఇద్దరిని కాపాడబోయిన ముగ్గురు సహా ఐదుగురు మరణించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లారు. పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి మృతదేహాల కోసం వెతికి వాటిని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఐదు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతులకు ఈత బాగా వచ్చినా నీటి ప్రవాహం వల్ల మునిగిపోయి ఊపిరాడక మరణించి వుంటారని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో సెల్ఫీల కోసం నదులు, జలపాతాలు, రైళ్ళలో ప్రయత్నాలు చేసి యువత తిరిగిరాని లోకాలకు చేరుతున్నారు. వీరి సరదా కుటుంబాలను విషాదంలో నింపేస్తోంది. 

మరికొందరు యువతీ, యువకులు సెల్పీ వీడియోలు తీసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడంపై విమర్శలు చేస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle