newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఏపీ కీలక నిర్ణయం.. గురుకులాల్లో ఐఐటీ, నీట్ అకాడమీలు

04-07-202004-07-2020 14:26:45 IST
Updated On 04-07-2020 15:29:26 ISTUpdated On 04-07-20202020-07-04T08:56:45.825Z04-07-2020 2020-07-04T08:55:47.142Z - 2020-07-04T09:59:26.062Z - 04-07-2020

ఏపీ కీలక నిర్ణయం.. గురుకులాల్లో ఐఐటీ, నీట్ అకాడమీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాలనలో సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో ముందడుగు వేశారు. విద్యార్ధులు ఉన్నతవిద్యను అభ్యసించేందుకు వీలుగా సరికొత్త పద్థతిని అమలులోకి తీసుకురానున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కోసం గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్‌ కాలేజీల్లో ఐఐటీ, నీట్‌ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. 

నిరుపేదలు సైతం ఉన్నతవిద్యను అభ్యసించేందుకు, పోటీని తట్టుకుని మంచి ర్యాంకుల ద్వారా ఐఐటీల్లో సీట్లు సాధించేందు ఈ అకాడమీలు దోహదం చేస్తాయి. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో రూ.8 కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తామని, వీటిల్లో విద్యార్థులకు ఐఐటీ, నీట్‌ ప్రత్యేక శిక్షణ అందిస్తామని వెల్లడించారు. 

ఇటీవల జరిగిన గురుకుల విద్యాలయాల సంస్థ పాలకవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నాలుగు విద్యా సంస్థలను అత్యున్నత కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. కొత్త పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, బోధన, బోధనేతర సిబ్బంది పదోన్నతులు, బదిలీలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీటిపై త్వరలో పూర్తి స్పష్టత రానుంది.  ఏపీలో ఇప్పటికే విద్యారంగంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. నాడు-నేడు, అమ్మ ఒడి పథకం, విద్యార్ధి నేస్తం వంటి పథకాల ద్వారా అనేక మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు వెసులుబాటు కలుగుతోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle