newssting
BITING NEWS :
*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

ఇటు కరోనా భయం.. అటు భూకంపం

29-03-202029-03-2020 10:29:32 IST
2020-03-29T04:59:32.326Z29-03-2020 2020-03-29T04:57:44.458Z - - 04-06-2020

ఇటు కరోనా భయం.. అటు భూకంపం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహమ్మారి కరోనా వ్యాప్తి చెందడంతో యావత్ ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో ఇండోనేషియా ప్రజల్ని భూకంపం వణికించింది. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో శనివారం రాత్రి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8 మాగ్నిట్యూడ్‌ తీవ్రత నమోదంది. మధ్య సులవేసి ప్రావిన్స్‌కు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్‌డోలో పట్ణణం వద్ద 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షప్తమై ఉందని అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.

ఈ భూకంపంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని.. సిగి జిల్లాలోని కులవి గ్రామంలో రెండు ఇళ్లు ధ్వంసం కాగా ఇద్దరు గాయపడ్డారని ఇండోనేషియా జాతీయ డిజాస్టర్‌ ఏజెన్సీ ప్రకటించింది. నిత్యం ఇండోనేషియా భూకంపాలు సంభవిస్తుంటాయి. తాజా భూకంపం తీవ్రత తక్కువగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఇటు ఉత్తర భారత ప్రజలను ఓభూకంపం వార్త వత్తిడికి గురిచేసింది. కరోనా లాక్ డౌన్ వేళ హిమాచల్ ప్రదేశ్‌లో వరుసగా భూ ప్రకంపనలు రావడం ఆందోళన కలిగించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు సార్లు భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు, .రిక్టార్ స్కేల్‌పై 3.00 నుంచి 4.3 మధ్య ఈ ప్రకంపనలు రావడంతో నష్టం జరగలేదు. చంబా జిల్లాలో శుక్రవారం సాయంత్రం 5.11 గంటలకు తొలి ప్రకంపనం నమోదైంది. రిక్టార్ స్కేల్‌పై 3.6గా నమోదైంది. 

అనంతరం సాయంత్రం 5.17 నిమిషాలకు 4.3తో నమోదయింది. తిరిగి కాసేపటి తర్వాత 5.45 గంటలకు 3.00గా తీవ్రత నమోదైంది. తిరిగి సాయంత్రం 6.49 గంటలకు 3.8 తీవ్రతతో మరోసారి కంపించింది. తర్వాత రాత్రి 8.43 గంటలకు 3.4 తీవ్రతతో చివరి ప్రకంపనం వచ్చినట్లు.. సిమ్లా వాతావరణ కేంద్రం డైరెక్టర్ మన్మోహన్ సింగ్ తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. చంబా జిల్లాలో 5 నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. 

Representational image


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle