newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

అరేబియా సముద్రంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

01-06-202001-06-2020 09:36:29 IST
Updated On 01-06-2020 09:51:08 ISTUpdated On 01-06-20202020-06-01T04:06:29.858Z01-06-2020 2020-06-01T04:06:09.926Z - 2020-06-01T04:21:08.431Z - 01-06-2020

అరేబియా సముద్రంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వేసవి కాలం వెళ్లిపోతోంది. జూన్ మొదటివారంలో తొలకరి చినుకులు పడుతుంటాయి. దానికి సంకేతంగా ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన అందించింది వాతావరణశాఖ. 

రాగల 24 గంటలలో తూర్పు మధ్య అరేబియా సముద్రం  దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో అల్పపీడనం వాయుగుండముగా మారే అవకాశం ఉంది. ఇది రాగల 24 గంటలలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను జూన్ 3 వ తేదీకల్లా ఉత్తర మహారాష్ట్ర గుజరాత్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. 

రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని  ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. జూన్ 1 వ తేదీన కేరళ రాష్ట్రంలోనికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.ఛత్తీస్ గఢ్ నుండి లక్షద్వీప్ వరకూ  తెలంగాణ, రాయలసీమ, దక్షిణ  కర్ణాటక కేరళ   మీదుగా 0.9 km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు  గంటకు  30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడురోజులు ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఒక వైపు రోహిణికార్తెలో భానుడు భగ్గుమంటుండగా.. మరోవైపు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది. సంగారెడ్డి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం, సాయంత్రం  భారీ వర్షం కురిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులు, వడగళ్ల వాన పడింది. వికారాబాద్‌ జిల్లాలో గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. మంచిర్యాల, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో వాన పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle